Manchu Family Property Dispute : నటులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆస్తి తగాదాల విషయంలో మోహన్ బాబు కుటుంబసభ్యులు కలెక్టర్ విచారణకు హాజరయ్యారు. తన ఆస్తులను మనోజ్ అక్రమంగా ఆక్రమించారని మోహన్‌బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మరోసారి విచారణకు హాజరు కావాలి : కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరైన మోహన్‌బాబు, మనోజ్, ఇద్దరూ ఆస్తి తగాదాలకు సంబంధించిన వివరాలు అందజేశారు. సుమారు 2 గంటల పాటు జిల్లా మేజిస్ట్రేట్ ఇద్దరినీ విచారించారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశింనట్లు సమాచారం. విచారణ అనంతరం మోహన్ బాబు వెనక నుంచి బయటకు రాగా, మనోజ్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
అసలేం జరిగింది : తాను సంపాదించిన ఇల్లు, ఆస్తులు మంచు మనోజ్ ఆక్రమించారంటూ మోహన్‌బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం తన ప్రతినిధితో లేఖను పంపించారు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తన స్వఆస్తిపై ఎవరికి హక్కు లేదన్న మోహన్ బాబు తన ఆస్తులు తనకు అప్పగించాలని కోరారు.
మంచు మనోజ్‌కు నోటీసులు : మోహన్ బాబు ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్‌కు వారం క్రితం నోటీసులు పంపించారు. వీటికి సమాధానమిచ్చేందుకు మనోజ్ జనవరి 19న కూడా కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌కు వచ్చారు. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మోహన్‌బాబు ప్రతినిధి గత నెల కలెక్టరేట్‌కు వచ్చి తనను కలిసి కుమారులు, ఆస్తుల గురించి వివరించి ఫిర్యాదు చేశారని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ నిర్వహించేందుకు ట్రైబ్యునల్ కార్యాలయం ద్వారా మనోజ్‌కు నోటీసులు పంపించామని తెలిపారు.
వందల కోట్లు పెట్టి సినిమా ఎలా తీస్తున్నారు : తమ తండ్రి, అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని మంచు మనోజ్ ఆరోజు మీడియాకు స్పష్టం చేశారు. తమ విద్యాసంస్థలు, ట్రస్ట్‌లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వ్యతిరేకించినందుకే అన్నయ్య మంచు విష్ణు, నాన్న మోహన్‌బాబును అడ్డుపెట్టుకుని నాటకమాడుతున్నారని ఆరోపణలు చేశారు. తమ వద్ద డబ్బుల్లేవ్ అంటున్న తండ్రి, అన్నయ్యలు రూ.వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు, విద్యార్థులు, బంధువుల కోసమే తాను పోరాడుతున్నానని, ఆస్తుల కోసం కాదని తెలిపారు.
'నా ఆస్తులన్నీ దోచుకుంటున్నారు' - మనోజ్‌పై మోహన్‌బాబు ఫిర్యాదు
నాపై, నా భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు : డీఎస్పీకి మనోజ్ ఫిర్యాదు