Railway Budget For Telangana 2024 : బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ సంబంధిత రైల్వే అధికారులతో కలిసి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం రైల్వే జీఎం మాట్లాడారు. ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి కాగా, త్వరలో మౌలాలి నుంచి సనత్‌నగర్ వరకు ఎంఎంటీఎస్ సర్వీస్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఎంటీఎస్ రెండో దశకునిధులు రావాల్సి ఉందని అన్నారు. నిధులు ఆలస్యంగా రావడం వల్ల పనులు మందకొడిగా జరుగుతున్నట్లు తెలిపారు. చర్లపల్లి టర్మినల్ పనులు కూడా వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో వస్తే పనులు త్వరగా పూర్తై, రైళ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
వెయ్యి కొత్త కోచ్‌లు.. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్.. రైల్వే శాఖకు బడ్జెట్ బూస్ట్
ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ( Nirmala Seetharaman) మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే వందే భారత్ రైళ్లపైప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈసారి బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రయాణికుల సౌకర్యాలు పెంచడానికి దృష్టి సారించినట్లు జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ (Railway GM Arun Kumar) అన్నారు. ఈ బడ్జెట్లో విద్యుదీకరణ, డబ్లింగ్‌కు పెద్దపీట వేశారని తెలిపారు.