PIL on Secret Cameras in Telangana High Court :రహస్య కెమెరాల విక్రయంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (Public Interest Litigation) దాఖలైంది. రహస్య కెమెరాల విక్రయాన్ని సవాలు చేస్తూ హెవెన్ హోమ్స్ సొసైటీ వ్యవస్థాపకురాలు వరలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
విధివిధానాలు లేకపోవడం వల్ల దుర్వినియోగం : సిక్రెట్ కెమెరాలను మార్కెట్, ఆన్‌లైన్‌లో నేరుగా విక్రయిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. కొంతమంది వాటిని వాష్‌రూమ్‌లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో, ఎక్స్‌రే గదుల్లో అమరుస్తున్నారని, ఈ కెమెరాల క్రయవిక్రయాలపై ఎలాంటి విధివిధానాలు లేవని, దీనివల్ల విచ్చలవిడిగా దుర్వినియోగం జరుగుతోందని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.