తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్న చినుకుకే చిత్తడవుతున్న భాగ్యనగరం - నగరానికి వాన కష్టాలు తొలగేదెలా? - Flood Water Problem in Hyderabad - FLOOD WATER PROBLEM IN HYDERABAD

Flood Water Problem In Hyderabad : వర్షాకాలం వస్తుందంటే హైదరాబాద్​లో వణుకే. కారణం మురుగు నీరు. చిన్న వర్షం పడితే చాలు రోడ్లన్నీ మురుగు నీటితో పారుతుంటాయి. ఆధునిక హంగులతో ముందుకు దూసుకెళ్తున్న మహానగరంలో ఎలాంటి చర్యలు చేపడితే వర్షపు నీటి సమస్యలను దూరం చేయొచ్చో అనే అంశంపైనే నేటి ప్రతిధ్వని.

Flood Water Problem In Hyderabad
Prathidhwani on Flood Water Problem in Hyderabd (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 9:56 AM IST

Prathidhwani on Flood Water Problem in Hyderabd : చినుకు పడితే పుడమి పులకరిస్తుంది. వేసవితాపంతో కాలికాలి ఉన్న నేలపై నైరుతి పలకరింపు గుబాళించే మట్టి వాసన మైమరిపించేలా చేస్తుంది. సాధారణంగా ఏటా తొలకరి వేళ అందరూ అనుభూతి చెందే మధుర క్షణాలవి. విశ్వనగరంగా పరుగులు తీస్తోన్న భాగ్యనగరంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధం.

చినుకు పడుతోందంటే చాలు వణుకే. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని వాన నీటి నిర్వహణ ప్రణాళికలు, సాకారం కాని నాలాల అభివృద్ధితో చిన్నపాటి వానకే జంటనగరాల ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండల వేడి నుంచి ఉపశమనం దొరికిందని సంతోష పడుతున్నంతలోపే మోకాల్లోతు నీటితో వెంటాడుతున్న ట్రాఫిక్ జామ్ కష్టాలు చికాకు పుట్టిస్తున్నాయి. ప్రపంచస్థాయి నగరంగా ఆధునిక హంగులతో దూసుకెళ్తోన్న హైదరాబాద్ మహా నగరానికి ఈ వాననీటి కష్టాలు తొలగేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details