తెలంగాణ

telangana

ETV Bharat / state

వినాయకుని పండుగ ఎలా జరుపుకోవాలి? పండుగ పరమార్థం ఏంటి? - Debate On Ganesh Chaturthi - DEBATE ON GANESH CHATURTHI

Prathidhwani Debate On Ganesh Chaturthi : వినాయకుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలా జరుపుకుంటున్నాము? పండగ పరమార్థం ఏంటి? ఇదే నేటి ప్రతిధ్వని

Ganesh Chaturthi Celebrations
Prathidhwani Debate On Ganesh Chaturthi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 11:32 AM IST

Prathidhwani Debate On Ganesh Chaturthi: వినాయక చవితి గురించి గణేష్ నవరాత్రుల గురించి దేశంలో తెలియని వారుండరు. యుగయుగాలు, తరతరాలుగా మన సంప్రదాయంలో ఇమిడిపోయిన దైవం విఘ్నేశ్వరుడు. ఆయన జననం వెనుక ఉన్న కథ దాదాపు అందరికీ తెలిసిందే. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు.

ఆది దంపతుల(శివ, పార్వతులు) మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. గణేశుడి కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల నమ్మకం. కానీ ఆ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలా జరుపుకుంటున్నాము? పండగ పరమార్థం ఏంటి? వినాయక ఆరాధన వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్పింది? వేలం వెర్రిని వీడి పవిత్రంగా ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి? ఇదీ నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details