Power Usage Increased in Telangana : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇండ్లలోని ఏసీలు ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లకు విశ్రాంతి ఉండటం లేదు. గ్రేటర్‌లో మార్చి, ఏప్రిల్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్ (Power Demand Increased in Telangana)రావడంతో పలు ఉపకేంద్రాల్లోని 80 శాతం కంటే ఎక్కువ లోడ్ ఉన్న పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్)ను ఎక్కువ సామర్థ్యం కలిగిన వాటితో మార్పిడి చేశారు.
Electricity Consumption Increased in Hyderabad :ఇప్పుడిక కాలనీల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్)ను మార్చబోతున్నారు. ఇందులో భాగంగా కరెంట్ వినియోగం అధికంగా ఉండే సమయంలో డీటీఆర్‌ల కచ్చితమైన లోడ్‌ను గుర్తించే మదింపు చేపట్టారు. టంగ్‌టెస్టర్ ద్వారా లోడ్‌ను గుర్తించి రికార్డు చేసే పనిని విద్యుత్ సిబ్బంది ఎక్కువగా రాత్రిపూట చేస్తున్నారు.
ఎండల నుంచి ఉపశమనానికి ఫ్యాన్లు, ఏసీల వాడకం - భారీగా పెరుగుతోన్న విద్యుత్ వినియోగం
ఒక్కో సర్కిల్‌లో ఒక్కోలా : విద్యుత్ గరిష్ఠ డిమాండ్ సాధారణంగా సాయంత్రం ఉంటుంది. ఈ సంవత్సరం పీక్ డిమాండ్ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఒక్కో సర్కిల్‌లో ఒక్కో సమయంలో నమోదవుతున్నట్లు ఇంజినీర్లు గమనించారు.
- ఐటీ కార్యాలయాలు, ఎత్తైన భవనాలు ఉన్న సైబర్‌సిటీ సర్కిల్‌లో ఈ నెల 5న రికార్డు స్థాయిలో 784.4 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత సంవత్సరం ఏప్రిల్ 20న గరిష్ఠంగా నమోదైన 455 మెగావాట్ల కంటే చాలా ఎక్కువ. నార్సింగి, గచ్చిబౌలిలో వెంటనే పీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచారు. ఈ సర్కిల్ పరిధిలో రాత్రి 11 నుంచి 12 మధ్య పీక్ లోడ్ ఉంటుంది.
- రాజేంద్రనగర్ సర్కిల్‌లోనూ సాయంత్రం 5 గంటల మధ్య అత్యధిక లోడ్ రికార్డైందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3న అత్యధికంగా 674 మెగావాట్ల డిమాండ్ నమోదైందని పేర్కొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 16న గరిష్ఠ డిమాండ్ 649.9 మెగావాట్లుగా ఉందని వివరించారు.
- సరూర్‌నగర్‌లో ఈ నెల 5న అత్యధికంగా 292.3 మెగావాట్లు నమోదైంది. క్రితం సంవత్సరం 6వ తేదీన 288 మెగావాట్లు రికార్డైంది. ఈ సర్కిల్‌లో సాధారణ వృద్ధినే ఉంది. నివాసకేంద్రాలు అధికంగా ఉండే ఈ సర్కిల్‌లో సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య పీక్ డిమాండ్ ఉంటుంది.
ఆర్‌ఆర్ జోన్‌లో సామర్థ్యం పెంచిన డీటీఆర్‌లు (కేవీఏ) :
సర్కిల్ | 100 నుంచి 160 | 160 నుంచి 315 |
సరూర్‌నగర్ | 118 | 4 |
సైబర్‌సిటీ | 106 | 6 |
రాజేంద్రనగర్ | 94 | 5 |