Minister Ponnam fires on BJP : బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని, రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని వ్యతిరేకిస్తే, ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
చేనేతలకు బీజేపీ(BJP) ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ ప్రభుత్వాలు రైతులకు పదేళ్లు ఏం చేశాయి? అని పొన్నం నిలదీశారు. ప్రజలకు న్యాయం జరగాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Lok Sabha Elections 2024 : కేంద్రప్రభుత్వం ఒక్క విభజన హామీ నెరవేర్చ లేదని మంత్రి పొన్నం మండిపడ్డారు. 7మండలాలు, విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పజెప్పారన్నారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యయని ఆయన నిలదీశారు. బీజేపీకి ఎజెండా లేదని దుయ్యబట్టారు. మోదీ, అమిత్ షాలు దేశంలో నవరత్నాల కంపెనీలు అమ్ముతున్నారని, బీజేపీ దళితులకు, బీసీలకు, మైనారిటీలకు వ్యతిరేకమని ఆరోపించారు.