తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతికి బంపర్ ఆఫర్‌ అంటూ సోషల్ మీడియాలో లింక్స్ - నమ్మి క్లిక్‌ చేశారో! - CYBERCRIMINALS TRAP

సంక్రాంతికి ఉచితంగా రీఛార్జ్‌ అని వచ్చే మెసేజ్‌లు నమ్మొద్దు - బంపర్‌ ఆఫర్‌ అనే ప్రకటనలు చూసి లింక్‌ క్లిక్‌ చేయొద్దు - అత్యాశకు వెళ్లి మోసాలకు గురికావద్దని సూచిస్తున్న తెలంగాణ పోలీసులు

CYBERCRIMINALS TRAP
SANKRANTI FESTIVAL CYBER CRIME (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2025, 5:16 PM IST

Sankranti Cyber Criminals Trap : సంక్రాంతి పండుగ సందర్భంగా షాపింగ్‌ చేయండి. పండుగ రోజు ఉచితంగా మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకోండి. ఊహించని విలువైన బహుమతులను సొంతం చేసుకోండి. ఇలా మీ ఫోన్, వాట్సాప్‌ నెంబర్లకు వచ్చిన మెసేజ్‌లు చూసి ఆశపడితే మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్మంతా గల్లంతైనట్టేనని హైదరాబాద్‌ నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పేరుతో వచ్చే ఫేక్‌ లింకులను క్లిక్‌ చేయవద్దంటున్నారు.

బాధితులు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు ఏ అవకాశాన్నీ వదలట్లేదు. సంక్రాంతి సంబరాల్లో ఆనందాలను ఆస్వాదించమంటూ లింకులు పంపి అమాయకుల జేబుకు చిల్లు పెట్టారు. ఖరీదైన హోటల్‌లో విందు వినోదాలంటూ, 50 శాతం రాయితీ అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి కుటుంబానికి రూ.1.50 లక్షల టోపీ పెట్టారు.

ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో : తాజాగా తెలుగా రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి కొత్త వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ-మెయిల్, వాట్సాప్‌ నంబర్లకు కొత్త దుస్తులు, నూతన వాహనాల కొనుగోళ్లపై రాయితీలు ఇస్తున్నట్టు అబద్ధపు ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి పేరుతో ఉచిత రీఛార్జ్‌ ఆఫర్‌ అంటూ రకరకాల లింకులు పంపుతున్నారు ప్రతి ఒక్కరికీ రూ.749 విలువైన 3 నెలల రీఛార్జ్‌ ఫ్రీ అని, ఈ పరిమిత కాలంలోనే మాత్రమే సదావకాశమంటూ లింకులు పంపుతున్నారు. క్లిక్‌ చేసిన వారి మొబైల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఊడ్చేస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు.

విరాళాలు ఇస్తామంటూ వచ్చే లింకులను నమ్మకండి - ఎందుకో చెప్పిన సైబర్ క్రైమ్ పోలీసులు

నయా స్కామ్​- మీ అకౌంట్​లో ఫ్రీగా రూ.5వేలు డిపాజిట్​- ఆనందంతో క్లిక్ చేస్తే అంతా ఖాళీ!

ABOUT THE AUTHOR

...view details