Prostitution With Foreign Girls : విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును హ్యుమన్ ట్రాఫికింగ్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌలిదొడ్డి టీఎన్జీవోస్ కాలనీలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. టీఎన్జీవోస్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో టెలిగ్రామ్ యాప్ ద్వారా గత మూడు నెలలుగా విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వివిధ దేశాల నుంచి యువతులు : విటులు అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకోగానే టెలిగ్రామ్‌లో పంపిన లింకును మాయం చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.