Lok Sabha Elections 2024 :మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 7 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి రాజమండ్రికి ఓ వాహనంలో తరలిస్తున్నారనే సమాచారంతో దాడి చేశారు. లారీని పరిశీలించగా, సేంద్రీయ ఎరువుల కింద మద్యం కాటన్లు అమర్చి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ మద్యం విలువ 2 కోట్ల 7లక్షల 36 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మైక్‌లు బంద్ - రాష్ట్రంలో ముగిసిన ఎన్నికల ప్రచారం - lok sabha elections 2024
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. 119 కాటన్ల మద్యాన్ని మినీ వ్యాన్లలో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోదాడకు చెందిన ఒక వైన్‌షాప్ నుంచి తీసుకెళ్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు మేళ్లచెరువు పోలీసులు తెలిపారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారు డీసీ తండా చెక్‌పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తరలిస్తున్న నాలుగు లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 50 వేలకు మించి నగదుతో ప్రయాణం చేయరాదని, ఒకవేళ అధిక మొత్తంలో నగదు ఉంటే సరైన ఆధారాలు చూపించాలని పోలీసులు తెలిపారు. బంగారం వంటి విలువైన వస్తువులకు సరైన ధ్రువపత్రాలు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.