తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్తాకోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టిన కిరాతకుల అరెస్ట్​ - నిందితుల్లో ముగ్గురు మైనర్లు

ఏపీ అత్యాచారం కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్ - పరారీలో మరొకరు - సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Satya Sai District SP On Gang Rape Case
Satya Sai District SP On Gang Rape Case (ETV Bharat)

Satya Sai District SP On Gang Rape Case :ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. తరచూ దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులే ఈ ఘటనలో కూడా నిందితులని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నాగేంద్ర, ప్రవీణ్‌తో పాటు మరో ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు.

ఐదుగురు నిందితుల అరెస్టు :రెండ్రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వాచ్‌మెన్‌ ఇంటికి వచ్చి బయట ఉన్న తండ్రీ, కొడుకులను బెదిరించి, ఇంట్లోకి ప్రవేశించి అత్తా కోడళ్లపై గ్యాంగ్‌ రేప్‌ చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న 5 వేల 200 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులు పాల్గొనగా ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఎస్పీ రత్న తెలిపారు.

పొట్టకూటికోసం వలస వచ్చి :అత్యాచారానికి గురైన బాధితులు కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ఉపాధి నిమిత్తం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్​మెన్​గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులు ముంగించుకొని శుక్రవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. శనివారం తెల్లవారుజామున ఆరుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు.

'నిందితుల్లోని ముగ్గురు మైనర్లకు తండ్రులు లేరు. వీరు టైల్స్​ కంపెనీలో పనులు చేసేవారు. ప్రధాన నిందితులు నాగేంద్ర వీరిని అసాంఘీక కార్యకలాపాలు చేసేందుకు శిక్షణ అందించారు. వీరితో ఇటువంటి పనులు చేయిస్తున్నారు' - రత్న, పుట్టపర్తి ఎస్పీ

నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు చేపడతామన్నారు.

పొట్టకూటి కోసం వలస వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్​ రేప్

హైదరాబాద్​లో అమానుష ఘటన - ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకుల అత్యాచారం - Two Girls Were Raped in Telangana

ABOUT THE AUTHOR

...view details