PM Narendra Modi Mann Ki Baat 119th Edition :మన్‌కీబాత్ 119వ ఎడిషన్‌లో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృత్రిమ మేధ గురించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో దేశంలో కృత్రిమ మేధ ఉపయోగాలను తెలిపారు. అందుకు ఉదాహరణగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ గురించి మాట్లాడారు. ఆయన కృత్రిమ మేధతో డిజిటల్ విధానంలో గోండు, కొలాం భాషల్లో పాటలు పాడించినట్లు వివరించారు.
'మన్ కీ బాత్'లో ప్రధాని నోట - తెలంగాణ ఉపాధ్యాయుడి మాట - MODI MANN KI BAAT
మన్‌కీబాత్ 119వ ఎడిషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - ఆదిలాబాద్ జిల్లా తొడసం కైలాస్ సేవలను అభినందించిన మోదీ
Published : Feb 24, 2025, 2:19 PM IST
మహాభారతాన్ని గోండు భాషలో : మహాభారతాన్ని గోండు భాషలోకి అనువదించడం, ఆదివాసీ భాషల్లో విద్యార్థులకు వార్తా ప్రసారాలు, కవిత్వాలు చెప్పారన్నారు. ఏఐ సాయంతో ఆదివాసీ భాషలను సంరక్షించడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కొలాం, గోండు భాషల్లోని పాటలు, కవితలతో ఆదివాసీలను ఆకట్టుకున్నట్లు చెప్పారు. గిరిజన ఉపాధ్యాయుడిని మోదీ అభినందించారు. ప్రధాని తనను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని మావల మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాస్ చెప్పారు.
మన్ కీ బాత్లో అరకు కాఫీపై మోదీ ప్రశంసలు - మరోసారి కలిసి తాగేందుకు వెయిట్ చేస్తున్నానన్న చంద్రబాబు - PM Modi About Araku Coffee