PM Modi Railway Projects Launch Telangana 2024 :వందే భారత్ వంటి రైళ్ల గురించి గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పదేళ్ల నుంచి రైల్వే రంగంలో వస్తున్న మార్పులు ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. ఇవాళ తెలంగాణలోని పలు రైల్వే అభివృద్ధి పనులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ స్టేషన్ల (Amrit Bharat Stations)ను ప్రారంభించారు. 1500 రైల్ ఫ్లై ఓవర్, అండర్ పాస్‌లకు భూమి పూజ చేయడంతో పాటు జాతికి అంకితం చేశారు.
హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని రాష్ట్రంలోని వివిధ రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
PM Modi Launches Telangana Railway Projects :ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకు పైగా నిధులతో 17 రైల్వే ఫ్లె ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్వే ఫ్లై ఓవర్, రైల్ అండర్ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ.621 కోట్లు కాగా, రాష్ట్రంలో మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్లు పునరాభివృద్ధికి రూ.224 కేట్లు ఖర్చు చేస్తున్నారు. గత ఆగస్టులో రూ.894 కోట్ల అంచనా వ్యయంతో 21 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
మోదీ మరో డేరింగ్ స్టంట్- సముద్ర గర్భంలోకి వెళ్లి శ్రీ కృష్ణుడికి పూజలు