ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన 'వింటర్‌ ఫెస్ట్‌' - న్యూ ఇయర్‌కు స్పెషల్‌ ఈవెంట్స్ - RAMOJI FILM CITY WINTER FEST

రామోజీ ఫిల్మ్‌సిటీలో అట్టహాసంగా మొదలైన వింటర్‌ ఫెస్ట్‌ - జనవరి ‍19 వరకు కొనసాగనున్న వింటర్‌ ఫెస్ట్‌ సంబరాలు- సందర్శకులను అలరించిన కార్నివాల్‌ పరేడ్‌

Winter Festival In Ramoji Film City
Winter Festival In Ramoji Film City (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Winter Festival In Ramoji Film City : పర్యాటకుల స్వర్గధామం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. అబ్బురపరిచే ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు, నృత్యాలు సందర్శకులకు మధురానుభూతుల్ని కలిగించాయి. క్రిస్మస్, న్యూ ఇయర్‌ను ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ తొలి రోజే విశేషంగా ఆకట్టుకుంది.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీలో వింటర్‌ ఫెస్ట్‌ ప్రారంభమైంది. మైమరిపించే సంగీతం, కళాకారుల ప్రదర్శనలు, తమాషా వేషాధారణలు, రంగురంగుల విద్యుద్దీపాలు, ఆటపాటలు ఇలా ఎన్నెన్నో విశేషాలు సందర్శకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. వింటర్‌ ఫెస్ట్‌ జనవరి 19వ తేదీ వరకు జరగనుంది. తొలిరోజు ప్రత్యేక వినోదాలు, సాయంత్రం వేళ కార్నివాల్‌ పరేడ్‌లు పర్యాటకులను అలరించాయి. ఉర్రూతలూగించే పాటలకు చిన్నాపెద్ద అందరూ జోష్‌గా డ్యాన్స్‌లు చేశారు.

కోల్​కతా ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ అదుర్స్​- బెస్ట్ డెకరేషన్ అవార్డు సొంతం - ramoji film city award

జీవితంలో ఒక్కసారైన ఫిల్మ్​సిటీని సందర్శించాలి : వింటర్ ఫెస్ట్‌కు పర్యాటకులు తరలివచ్చారు. రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలను వీక్షిస్తూ మంత్రముగ్ధులయ్యారు. కుంటుంబసభ్యులతో, స్నేహితులతో ఉల్లాసంగా గడిపారు. కార్నివాల్‌ పరేడ్‌ జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలను మిగిల్చిందని చెప్పారు. బాహుబలి సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్య సెట్లు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. జీవితంలో ఒక్కసారైనా ఫిల్మ్​సిటీ సందర్శించాల్సిందేనని కితాబిచ్చారు.

"ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. ప్రతిఒక్కరు వచ్చి చూడాల్సిన ప్రదేశం. సినిమా సెట్లు, రైడ్స్‌ ప్రతిఒక్కటి సూపర్‌గా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలున్నాయి. ఫుడ్‌ కూడా చాలా బాగుంది. వచ్చేటప్పుుడు ఇలా ఉంటుంది అని అనుకోలేదు కానీ చూశాకా వావ్‌ అనే మాదిరిగా ఉంది." - పర్యాటకులు

న్యూ ఇయర్​ వేడుకలకు పూర్తి వినోదం : న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో డిసెంబర్‌ 31న డీజే చేతాస్‌ లైవ్‌ ప్రదర్శనతో పర్యాటకులను ఓలలాడించనున్నారు. సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆకాశాన్నంటే ఉత్సాహం మధ్య కొత్త ఏడాదికి స్వాగతం పలికే అవకాశాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీ అందిస్తోంది. నృత్య ప్రదర్శనలు, అంతర్జాతీయస్థాయి ఫైర్‌ యాక్షన్స్‌, స్టాండప్‌ కామెడీ ఇలా క్షణక్షణం మధురమైన అనుభూతిని పంచే సంబరాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. డిసెంబరు 19న ప్రారంభమైన వింటర్‌ ఫెస్ట్‌ జనవరి 19 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో బస చేసి లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ను మరింతగా ఆనందించేలా నిర్వాహకులు చక్కటి అవకాశం కల్పిస్తున్నారు. పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

ప్రియాఫుడ్స్ నుంచి 'భారత్‌ కా సూపర్‌ఫుడ్‌' - 45 రకాల చిరుధాన్యాలతో మార్కెట్లోకి 'సబల మిల్లెట్స్​'

చెన్నై ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి- విజిటర్స్​ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.