తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ ఎన్నికల వేళ తారాస్థాయికి - రోజుకు 10 చొప్పున 4 నెలల్లో 1300 ఫోన్ల ట్యాపింగ్​ - Phone Tapping Case Latest News - PHONE TAPPING CASE LATEST NEWS

Phone Tapping Case Update : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు 10 ఫోన్లు ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించినట్లు దర్యాప్తు బృందం విచారణలో తేలింది. 4 నెలల వ్యవధిలో దాదాపు 1,300 ఫోన్లపై రహస్యంగా నిఘా పెట్టినట్లు సమాచారం. గత శాసనసభ ఎన్నికల వేళ విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

BRS Use Information Use Phone Tapping
Phone Tapping Case Details (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 7:21 AM IST

Telangana Phone Tapping Case (ETV Bharat)

Phone Tapping Case Update : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సుదీర్ఘ కాలం సాగినా, ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు నాలుగు నెలల కాలంలోనే 1300 ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. రోజుకు సగటున పదికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తేలింది. ఎస్​ఐబీ కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబర్ నెలాఖరున ముగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు లబ్ధి చేకూర్చడంపైనే ఎస్​ఐబీ మాజీ ఓఎస్​డీ ప్రభాకర్‌రావు బృందం శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

Phone Tapping Case Details : బీఆర్ఎస్​ అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం, వారి అనుచరుల కార్యకలాపాల్ని పసిగట్టడం, వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించడం, వీలు కుదిరితే బీఆర్​ఎస్​కు అనుకూలంగా మార్చడం తదితర వ్యవహారాలపై ప్రభాకర్‌రావు బృందం దృష్టి పెట్టినట్లు విచారణలో తేలిందని సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ పలుచోట్ల బీఆర్ఎస్​ ప్రత్యర్థి పార్టీలకు చెందిన సొమ్మును జప్తు చేయించగలిగినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - ఎస్​ఐబీ చీఫ్ అరెస్టుకు వారెంట్ జారీ - Prabhakar Rao Arrest warrant

Officials Leak Information to BRS: ఎన్నికల సమయంలో హైదరాబాద్ సహా శివార్లలో రూ.కోట్ల సొమ్మును పట్టుకోగలిగారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ బీఆర్​ఎస్​ ప్రత్యర్థి పార్టీలపై నిఘా ఉంచారు. అయితే గత శాసనసభ ఎన్నికల వేళ మాత్రం ఫోన్ ట్యాపింగ్‌ను విస్తృతం చేశారు. సగటున రోజుకు 10 ఫోన్లకు పైగా నిఘా ఉంచడం ద్వారా అప్పటి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే దిశగా పన్నాగాలు పన్నారని దర్యాప్తు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది.

BRS Use Information Use Phone Tapping: నాలుగు నెలల్లోనే సుమారు 1300 ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడవడంతో తదుపరి అంకంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా బాధితులకు సమాచారమిస్తూ వారితో వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చట్ట విరుద్ధంగా తమ ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని గురించి బాధితులతో చెప్పిస్తున్నట్లు సమాచారం. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు అంగీకరించినా, వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉంటుంది. ఇందుకోసం బాధితుల వాంగ్మూలాలే కీలకం కావడంతో అధికారులు ఈ ప్రక్రియపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఫోన్‌ ట్యాపింగ్‌ అనుమతుల్లో గూడుపుఠాణి - ప్రభాకర్‌రావుకు అధికారం ఇచ్చిందెవరు? - Telangana Phone Tapping Case

ఫోన్​ ట్యాపింగ్​ కేసు అప్​డేట్స్​ - ఆ ఇద్దరిని అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరనున్న పోలీసులు - Telangana Phone Tapping Case

ABOUT THE AUTHOR

...view details