Phone Tapping Accuse Radhakishan Rao Mother Passed Away :ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న రిటైర్డ్ డీసీపీ పి. రాధాకిషన్ రావుకు మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించింది. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లెగుట్టకు చెందిన రాధాకిషన్‌రావు పదోన్నతి పొందుతూ డీసీపీ స్థాయికి ఎదిగారు.
తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ఇటీవలే తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టు అనుమతి తీసుకున్న రాధాకిషన్‌రావు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి పరమర్శించారు. 98 ఏళ్ల వయసు ఉన్న సరోజనమ్మ నూరేళ్ల పాటు జీవించాలని కుటుంబ సభ్యులు ఆశించారు.
Radhakishan Rao Mother Died :వీరి కుటుంబంలో చాలా మంది దీర్ఘాయుష్షు అందుకున్న వారే కావడంతో సరోజనమ్మ కూడా నిండు నూరేళ్లు బ్రతకాలని వారసులు ఆకాంక్షించారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సరోజనమ్మకు కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నపటికీ ఫలితం లేకుండా పోయింది.
ఆమె మరణించిన సమాచారం అందుకున్న రాధాకిషన్‌రావు తన తల్లిని చివరి చూపు చూసేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేయించారు. అత్యవసర పిటిషన్‌ను విచారించి తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ రాధాకిషన్‌రావు నాంపల్లి కోర్టును అభ్యర్థించారు.