Pawan Kalyan Key Role in TDP and BJP Alliance :'ఎక్కడ నెగ్గాలో కాదు- ఎక్కడ తగ్గాలో తెలుసినోడు గొప్పోడు' అత్తారింటికి దారేది చిత్రంలో హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాత్రను ఉద్దేశించి ఎం.ఎస్.నారాయణ పలికిన ఈ ఫేమస్ డైలాగ్ పవన్ రాజకీయ జీవితంలోనూ నూటికి నూరుపాళ్లు వర్తిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈరోజు దిల్లీలో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు కోసం ఒకచోట కూర్చుని మనసు విప్పి మాట్లాడుతున్నారు అంటే దానికి వెనుకున్న ఒకే ఒక శక్తి పవన్ కల్యాణ్(Pawan Kalyan). ఆయన నిరంతర ప్రయత్నమే ఈ పొత్తు పొడవడంలో మూలం.
BJP, TDP and and Janasena Alliance : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ పొత్తు కోసం జనసేనాని చేసిన ఈ ప్రయత్నంలో చాలా రాళ్లు వేశారు, చాలా మంది హేళన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి నవ్వులుపాలు అవ్వడం ఇందుకోసం పవన్ కల్యాణ్ చేసిన ఒక త్యాగమనే చెప్పుకోవాలి. ఏపీలో అండగా రావాలి అంటే తెలంగాణలో త్యాగం చెయ్యని తప్పని పరిస్థితుల్లో బలహీనమైన స్థానాలతో సర్దుకుని పోటీ చేశారు. ఆ ఓటమి మిగిల్చిన అవమానం అంతా ఇంతా కాదు. ఆ రోజు దిగమింగారు కాబట్టే ఈ రోజు గౌరవంతో తలెత్తుకోగలిగారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్
రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదా! ఏం చేస్తారు మమ్మల్ని జైళ్లో పెడతారా? తీవ్ర ఆవేదన, ఉప్పొంగిన ఆవేశం 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ గుర్తే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో అధికార టీడీపీ సభ్యులంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరైన సందర్భం అది.