Pawan Kalyan Bhimavaram tour: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విసృస్థాయిలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఇప్పటికే రచించారు. అందులో భాగంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. 14న భీమవరంతో మెుదలు కానున్న పవన్ పర్యటన 17 రాజమహేంద్రవరంలో ముగుస్తుంది. ఈ పర్యటనలోనే జనసేన మ్యానిఫేస్టో, అభ్యర్థుల ప్రకటన ఉంటుందని జనసేన నేతలు వెల్లడించారు. తాజాగా భీమవరంలో హెలికాప్టర్‌కు అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో రేపటి పవన్ భీమవరం పర్యటన వాయిదా పడింది.
భీమవరం పర్యటన వాయిదా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌లో పవన్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరితే అధికారులు అభ్యంతరం చెబుతూ నిరాకరించారు.
సర్దుబాట్లు కొలిక్కి వచ్చినట్లేనా! ఒకేరోజు రెండుసార్లు చంద్రబాబు, పవన్‌ల భేటీపై సర్వత్రా ఆసక్తి
అభ్యంతరం తెలిపిన ఆర్‌అండ్‌బీ శాఖ: భీమవరంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం జనసేన కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంది. ఈనేపథ్యంలో జనసేన విజ్ఞప్తికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. హెలిప్యాడ్ పరిశీలనలో పోలీసుశాఖ నుంచి అనుమతి లబించగా, ఆర్ అండ్ బీ శాఖ అభ్యంతరాలు తెలిపింది. హెలిప్యాడ్ నుంచి 50 మీటర్ల దూరంలో భవనాలు ఉన్నాయని, హెలిప్యాడ్ నుంచి 100 మీటర్ల వరకు భవనాలు ఉండరాదని ఆర్ అండ్ బీ శాఖ పేర్కొంది. దీని వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉన్నట్టు అర్థమవుతోంది. ఇదే హెలిప్యాడ్‌ను పలువురు ప్రముఖులు భీమవరం పర్యటనకు వచ్చినప్పుడు వినియోగించారు. ఇప్పుడు పవన్ విషయంలో అభ్యంతరాలు చూడటం విచిత్రంగా ఉంది. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్‌అండ్‌బీ అధికారులు అనుమతుల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపునకు వాడుకోవడాన్ని ఖండిస్తున్నట్లు జనసేన ప్రకటనలో పేర్కొంది.
పార్టీ విరాళాల చెక్కులు వెనక్కి పంపిన జనసేనాని - ఎందుకలా చేయాల్సి వచ్చింది