ETV Bharat / state

'మా సమస్యను పట్టించుకోవట్లేదు' - చంద్రబాబుతో విదేశీ వైద్య విద్యార్థులు - FOREIGN MEDICAL STUDENTS MEET CM

సచివాలయంలో సీం చంద్రబాబును కలిసిన విదేశీ వైద్య విద్యార్థులు - తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం

Foreign_medical_students_meet_CM
Foreign_medical_students_meet_CM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 10:31 PM IST

Foreign Medical Students meet CM Chandrababu: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విదేశీ వైద్య విద్యార్ధులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చారు. కరోనా సమయంలో విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్ధుల కష్టాలు ఇంకా తీరలేదు. తమకు శాశ్వత రిజిస్ట్రేషన్, ఎన్​వోసీ పత్రం ఇచ్చేందుకు ఏపీఎంసీ (ఆంధ్రప్రదేశ్​ మెడికల్​ కౌన్సిల్​) అధికారులు చర్యలు చేపట్టలేదని వైద్య విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

గత 9 నెలలుగా ఏపీఎంసీ చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పీఆర్, ఎన్​వోసీ అన్నీ ఇచ్చారని సీఎంకు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు, మూడేళ్ల పాటు ఇంటర్న్ షిప్ చేయాలని అధికారులు చెప్పటం ఆవేదన కలిగిస్తుందని వాపోతున్నారు. చాలామంది విద్యార్ధులు పీజీ వైద్య పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారని, మూడేళ్ల పాటు ఇంటర్న్ షిప్ చేస్తే విలువైన సమయం నష్టపోతామని సీఎంకు వివరించినట్లు విద్యార్ధులు తెలిపారు.

అన్ని విభాగాలు కరోనా సమయంలో ఆన్​లైన్ ద్వారానే తమ కార్యకలాపాలు జరిపాయని అన్నారు. తమ సమస్యలు విన్న సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని విద్యార్ధులు చెబుతున్నారు. త్వరలోనే తమ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు విద్యార్ధులు తెలిపారు.

కిక్కిరిసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు - రెండు రోజుల్లో భారీగా ఆదాయం

మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు - వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.