ETV Bharat / state

ట్రైనింగ్​తో పాటు ఉద్యోగం - ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో సీడాప్‌ ఒప్పందం - SEEDAP MOU WITH ISB

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో సీడాప్‌ ఒప్పందం - శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపిన సీడాప్ ఛైర్మన్ దీపక్‌రెడ్డి

SEEDAP MOU WITH ISB
SEEDAP MOU WITH ISB (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 10:19 PM IST

SEEDAP MOU WITH ISB: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్తను తయారుచేయాలనే లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ఇండియన్‌ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)తో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ఉపాధి కల్పన వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (SEEDAP) ఛైర్మన్‌ దీపక్‌రెడ్డి తెలిపారు. యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా 24 సెక్టార్స్​లో శిక్షణ కోసం ఐఎస్బీతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్​ప్రెన్యూర్ నినాదం సాకారం చేసేందుకు ఐఎస్​బీతో కొన్ని కోర్సులకు ఎంవోయూ చేసుకున్నామని అన్నారు.

సెంచూరియన్ యూనివర్శిటీతోనూ గతంలో ఒప్పందం చేసుకున్నామని, 40 శాతం ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్​లో రానున్న మూడు సంవత్సరాల్లో 22 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సీడాప్ ఒక నోడల్ ఏజెన్సీగా ఉండేలా, ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్స్​లో పని చేస్తుందన్నారు.

యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా క్షేత్ర స్ధాయిలో యువతకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజల సౌకర్యం కోసం మన మిత్ర అనే యాప్ ద్వారా 166 సర్వీసులు అందుబాటులో ఉండేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని, దీన్ని 520 సర్వీసులకు తీసుకెళ్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు లక్ష్యంగా సీఎం చంద్రబాబు పెట్టుకున్నారని, అందులో సీడాప్ కూడా భాగస్వామి అయ్యిందన్నారు. యువతకు ఉపాధి కల్పనలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. తయారీ రంగంలో నాయకత్వ పటిమను పెంచేలా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమైనదని ఐఎస్​బీ ప్రతినిధి చందన్‌ చౌదరి అన్నారు.

"దేశంలో తయారీ రంగం వృద్ధి చెందకపోవడం వల్ల ఉద్యోగాల కల్పన కష్టసాధ్యంగా మారింది. రాష్ట్రంలో ఉత్పత్తి రంగంలో నాయకత్వ సామర్థ్యాలను పెంచగలిగితే అది ఉద్యోగాల సృష్టిని బలపరుస్తుంది. ఈ విషయంలో ఏపీ దేశంలోనే ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించగలదు. తయారీ రంగంలో ఒక్క ఉద్యోగం సృష్టించగలిగితే అది అనుబంధ రంగాల్లో మరో 5 ఉద్యోగాలను పుట్టించగలదని చెబుతారు. అందువల్ల ఈ అవగాహన ఒప్పందం ఓ చరిత్రాత్మక ఘటనగా నిలుస్తుంది". - డాక్టర్ చందన్ చౌదరి, ఐఎస్​బీ ప్రతినిధి

గుడ్​న్యూస్​ - త్వరలో 16,347 టీచర్​ పోస్టులకు నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.