ETV Bharat / state

కోడూరులో తీగలాగితే - తిరుపతిలో డొంక కదిలింది - POLICE SEIZE FAKE LIQUOR IN AP

తిరుపతి నగర శివార్లలో నకిలీ మద్యం - 805 లీటర్ల స్పిరిట్‍, 6,600 ఖాళీ బాటిల్స్, వివిధ బ్రాండ్లతో కూడిన లేబుల్స్​ స్వాధీనం

POLICE SEIZE FAKE LIQUOR TIRUPATI
POLICE SEIZE FAKE LIQUOR TIRUPATI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 9:02 PM IST

Police Seized Fake Liquor In Tirupati: తిరుపతి నగర శివార్లలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు ఎన్టీఆర్ కాలనీ బ్లాక్ నెంబర్ 62 లో మద్యం మెటీరియల్​ను అధికారులు పరిశీలించారు. కోడూరులో నకిలీ మద్యం పట్టుబడిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేయడంతో తిరుపతిలోని నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు బయటపడింది. దాంతో ఘటనా స్ధలానికి చేరుకుని ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు.

నకిలీ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు: నకిలీ మద్యంలో ముఖ్య పాత్ర కలిగిన వెంకటరమణ అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రొహిబిషన్‍ అండ్​ ఎక్సైజ్‍ డిప్యూటీ కమిషనర్‍ విజయ్‍ శేఖర్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి 150 గ్రాముల బంగారం, రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక దాదాపు 805 లీటర్ల స్పిరిట్‍, 6,600 ఖాళీ బాటిల్స్, వివిధ బ్రాండ్లతో కూడిన లేబుల్స్​ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

ప్రభుత్వం తక్కువ రేటుకు క్వాలిటీ లిక్కర్‍ అందజేయాలని చూస్తుంటే ఈ ముఠా పక్కదోవ పట్టిస్తుందన్నారు. ఈ నకిలీ మద్యాన్ని 2020 నుంచి తయారీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కడప, చిత్తూరు, తిరుపతి పోలీసుల సహకారంతో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.

"నకిలీ మద్యంలో ముఖ్య పాత్ర కలిగిన వెంకటరమణ అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. దాదాపు 805 లీటర్ల స్పిరిట్‍, 6,600 ఖాళీ బాటిల్స్, వివిధ బ్రాండ్లతో కూడిన లేబుల్స్​ని స్వాధీనం చేసుకున్నాం". -విజయ్ శేఖర్, ప్రొహిబిషన్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్

ఒక్కరోజులో లక్షా 20 వేల బీర్లు లేపేశారు - ఆ రెండు జిల్లాల్లో రూ.36 కోట్ల ఆదాయం

లిక్కర్ బిజినెస్​లోకి సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు - మద్యం దుకాణాల దరఖాస్తుల్లో 'వారే' అధికం! - AP NEW LIQUOR POLICY 2024

మద్యం సేవించి నిద్రలోకి జారుకున్నాడు - తెల్లారేసరికి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.