Winter Festivals Celebrations in Araku: అల్లూరి జిల్లాలో పర్యాటక ప్రాంతమైన అరకులో చలి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చలి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గిరిజన ప్రాంతాల ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో 7 రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారులు పాల్గొని గులాబీ తలపాగా చుట్టుకుని నృత్యం చేశారు. వేలమంది పర్యాటకులు ఉత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ చలి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా 5కే రన్: ఈ ఉత్సవాల్లో భాగంగా 5కే రన్ నిర్వహించారు. మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడ్, ఐటీడీ ఎపీఓ అభిషేక్, అదనపు ఎస్పీ, సబ్ కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అరకులో ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ - ప్రత్యేక ఆకర్షణగా పారా గ్లైడింగ్
ఇంజినీరింగ్ విద్యార్థి ఇన్నోవేషన్- పోలీసు సేవలను సులభంగా వినియోగించుకునేలా వెబ్‌సైట్