ETV Bharat / state

'సంస్కరణలను అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబు' - CM AND NITI AAYOG VC DISCUSSION

సీఎం చంద్రబాబు, నీతిఆయోగ్ వైస్‌ ఛైర్మన్ మధ్య ఆసక్తికర చర్చ - చంద్రబాబుతో తనకున్న అనుబంధం గుర్తుచేసుకున్న సుమన్ బేరీ

CM_and_NITI_Aayog_VC_Discussion
CM_and_NITI_Aayog_VC_Discussion (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 10:26 PM IST

Interesting Discussion Between CBN and Niti Aayog Vice Chairman: సీఎం చంద్రబాబు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని సుమన్ భేరీ గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును కలిసిన సంగతులు సుమన్ బేరీ గుర్తు చేసుకున్నారు. గవర్నర్​గా పని చేసిన రంగరాజన్​తో కలిసి నాడు హైదరాబాద్​లో చంద్రబాబును కలిసిన అంశాలను సమన్ బేరీ ప్రస్తావించారు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నా సంస్కరణలు అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబే అంటూ ప్రశంసలు కురింపించారు.

వాజ్​పేయి హయాంలో నాటి సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకువచ్చిన పాలసీలు ప్రజల జీవితాలు మార్చాయని సుమన్ బేరీ అన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ప్రతీ పాలసీ, ప్రతీ సంస్కరణ తరువాత కాలంలో దేశం పాటించిందని అన్నారు. ఐటీకి ప్రోత్సాహంతో పాటు ఎయిర్ పోర్టులు, ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లు, పీపీపీ పద్దతిలో రోడ్లు వంటి అనేక ఆవిష్కరణలకు నాంది పలికారంటూ సుమన్ బేరీ కితాబిచ్చారు. భవిష్యత్ అవసరాలను గుర్తించి ఆలోచనలు, పాలసీలు అమలు చేసే నాయకులతో ప్రజల జీవితాలు మారుతాయని అన్నారు.

సంస్కరణలకు అందిపుచ్చున్న ఫలితాలు ఉమ్మడి ఏపీలో కనిపించాయని సుమన్ బేరీ అన్నారు. ఇప్పుడు ఇండియా టైం వచ్చిందని ఈ సమయాన్ని దేశం 100 శాతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ శక్తిగా ఎదగడానికి ఇప్పుడు వేగంగా అడుగు వేయకపోతే ఇక ఎప్పుడూ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో అన్ని అవకాశాలను అందుకుని దేశం ముందడుగు వేస్తుందని అభిప్రాయపడ్డారు.

కసి పట్టుదలతో పని చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు కష్టపడుతున్నామని స్వర్ణాంధ్ర విజన్​కు అన్ని విధాలా సహకారం కావాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని సీఎం చంద్రబాబు కోరారు. సమావేశం అనంతరం సుమన్ బేరీ వాహనం వద్దకు వెళ్లి సీఎం చంద్రబాబు వీడ్కోలు పలికారు.

'వికసిత ఏపీకి సహకరించండి' - నీతి అయోగ్ ఉపాధ్యక్షుడుని కోరిన సీఎం చంద్రబాబు

మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని కుట్ర - జగన్​పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.