తెలంగాణ

telangana

ETV Bharat / state

'చెట్లే ప్రతి జీవకోటికి ప్రాణాధారం' - రాష్ట్రంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం - Awareness on Environment Day

World Environment Day : భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు. అలాంటిది మెుక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకోని రాష్ట్రంలో పలు చోట్ల కలెక్టర్లు, న్యాయమూర్తులు మెుక్కలు నాటారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 8:06 PM IST

Awareness on World Environment Day in Telangana
World Environment Day (ETV Bharat)

'చెట్లే ప్రతి జీవకోటికి ప్రాణాధారం' - రాష్ట్రంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం (ETV Bharat)

Awareness on World Environment Day in Telangana : హైదరాబాద్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మొక్కలు నాటారు. ఒక్కప్పుడు కాలానికి అనుగుణంగా వర్షాలు పడేవని, ఇప్పుడు పర్యావరణ సమతుల్యంతో వ్యత్యాసాలను చూస్తున్నామన్నారు.

వనస్థలిపురంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం చేపట్టారు. ఓయూ ఆవరణంలో ఉన్న బండరాళ్లపై వివిధ రకాల పక్షుల బొమ్మలను గీసిన ఓ చిత్రకారుడు, అంతరించిపోతున్న వన్యప్రాణులను బతికించుకోవాలంటే అందరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు.

గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోశ్​ కుమార్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్న ఆయన పచ్చదనం కోసం ప్రతిఒక్కరు తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్‌ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీని చేపట్టారు.

'భవిష్యత్తు తరాలకు ఏమైనా ఇవ్వాలనుకుంటే చెట్లు నాటడం కన్నా మించిన కానుక లేదు. ప్రతిఒక్కరు రెండెసి మొక్కలు నాటాలి. పర్యావరణ వాతావరణంలో స్వల్ప మార్పులు వస్తున్న నేపథ్యంలో అందరూ మొక్కలు నాటడం గానీ లేదా నీటి సంరక్షణ చూసుకోవడం చేయాలి. ఈ విధంగా అందరూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నా'- ప్రకృతి ప్రేమికులు

పర్యావరణ పరిరక్షణపై అవగాహన :జయశంకర్‌ భూపాలపల్లిలో జిల్లా కోర్టు నుంచి అంబేడ్కర్‌ కూడలి మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్డు ఆవరణంలో చెట్లు నాటారు. ఒక మెుక్కను తొలగిస్తే దానికి బదులుగా మరో నాలుగు మెుక్కలు నాటాలని కోరారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా అధికారులు అధికారులు మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ తన తల్లితో కలిసి మొక్కను నాటారు. మిరుదొడ్డి, అక్బర్ పేట- భూంపల్లి మండలాల పరిధి గ్రామాల్లో అధికారులు మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు పాఠశాల, దేవాలయాలు, రోడ్డుకు ఇరు ప్రక్కల మొక్కలు నాటారు. అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు.

'మా పిల్లలకు పర్యావరణ పరిరక్షణ గురించి దినచర్యలో భాగంగా ఎలా కావాలో అలాంటి విషయాల గురించి మేం చెబుతాం అని ప్రమాణం చేశాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరికీ కూడా పర్యావరణ పరిరక్షణ ఒక నినాదంగా ఉండకూడదు. అది జీవన విధానం కావాలి, ప్రతి ఒక్కరికీ దినచర్యగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆశించిన వాతావరణంతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది'- ప్రకృతి ప్రేమికులు

మానవాళికి శాపంగా భూతాపం- మన కర్తవ్యమేంటి? ఏం చేయాలి? - World Environment Day 2024

ABOUT THE AUTHOR

...view details