2024 KTM 250 Duke: బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్. ప్రీమియం అండ్ స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ KTM ఇండియా తన ఇయర్ ఎండ్ ఆఫర్‌ను ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ ఆఫర్‌గా తన '2024 KTM 250 డ్యూక్' పెర్ఫార్మెన్స్ బైక్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ధరను ఏకంగా రూ.20,000 తగ్గించి ప్రస్తుతం దీన్ని రూ. 2.25 లక్షలకే విక్రయిస్తోంది. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉండనుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఆఫర్లో దీన్ని కొనుగోలు చేసి మీ ప్రియమైన వారితో ఓ ప్రీమియం రైడ్‌కు వెళ్తే పోలా..!!
ఇక దీని ప్రీవియస్ మోడల్‌ను అప్డేట్ చేసి '2024 KTM 250 డ్యూక్' బైక్‌ను ఇటీవలే అక్టోబర్‌లో లాంఛ్ చేశారు. KTM 250 డ్యూక్ పాత మోడల్లో TFT డిస్‌ప్లే, హెడ్‌లైట్ వంటి వాటిని అప్డేట్ చేస్తూ దీన్ని డిజైన్ చేశారు. వీటితోపాటు కంపెనీ ఈ '2024 KTM 250 డ్యూక్' మోడల్లో 'Street', 'Track' అనే రెండు రైడింగ్ మోడ్స్‌ను కూడా జోడించి రిలీజ్ చేసింది.
అంతేకాక ఇందులో దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. దాని TFT డ్యాష్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ వంటి వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అయితే కంపెనీ ఈ దీని పాత మోడల్‌కు ఇన్ని అప్డేట్లు చేసినా కూడా దానిలో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. అంటే దీని ప్రీవియస్ మోడల్, ఇందులో సేమ్ మెకానికల్ ఫీచర్లు ఉంటాయనమాట.
ఈ బైక్ దాని ప్రీవియస్ మోడల్ మాదిరిగానే అదే లిక్విడ్-కూల్డ్, 249cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 9,250rpm వద్ద 31hp పవర్, 7,250rpm వద్ద 25Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ రెండింటినీ కలిగి ఉంటుంది.
2024 KTM 250 Duke కలర్ ఆప్షన్స్: ఈ బైక్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- డార్క్ గాల్వానో
- ఎలక్ట్రానిక్ ఆరెంజ్
- అట్లాంటిక్ బ్లూ
దీని ధరను తగ్గించినా కూడా ఈ 'KTM 250 డ్యూక్' బైక్ రేటు.. దాని హుస్క్‌వర్నా కౌంటర్ పార్ట్- 'విట్పిలెన్ 250' కంటే రూ. 8,000 ఎక్కువగా ఉంది. అయితే ఇందులో వర్రీ అవ్వాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఇది ధరకు తగినట్లుగానే మరింత ఎక్కువ ఎక్విప్మెంట్తో వస్తుంది.
తిప్పరా మీసం.. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధం!
సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అద్భుతమైన మైలేజ్.. అదిరే ఫీచర్లతో రూ.8 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే!