ETV Bharat / state

మూసీలో 12 హాట్​స్పాట్లు - అక్కడ మురుగు, వ్యర్థ జలాలను ఆపితేనే పునరుజ్జీవం - STORY ON MUSI RIVER POLLUTION

మూసీకి ఎగువన, దిగువన మొత్తం 12 హాట్​స్పాట్లు - రసాయనిక వ్యర్థాలు ఉపనదిలోకి చేరి అత్యంత ప్రమాదకరంగా మారుతున్న జలాలు

Story On Musi River Pollution
Story On Musi River Pollution (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2024, 4:37 PM IST

Story On Musi River Pollution : "మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. నదీ గర్భం, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌లో(ఫుల్​ ట్యాంక్​ లెవల్​) ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే. అదే సమయంలో నదిలో కలుస్తున్న మురుగు, వ్యర్థనీటిని పూర్తిగా ఆపాలి" అంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు మూసీలో వ్యర్థాలు ముఖ్యంగా పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి జలాలు ఎక్కడెక్కడ ఎంత పరిమాణంలో కలుస్తున్నాయి. వాటిని ఎంతవరకు శుద్ధి చేస్తున్నారు? పూర్తిగా శుద్ధి చేసేందుకు ఏం చేయాలి? కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఆ నీటిని టెస్ట్ చేస్తోందా? వాటిలో తేలిన అంశాలేమిటి? అనే అంశాలపై ప్రత్యేక కథనం.

వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండల్లో జన్మించిన మూసీ నల్గొండ జిల్లాలోని వాడపల్లి అనే ప్రాంతం వద్ద కృష్ణాలో కలుస్తుంది. పరీవాహకంలో ఉన్న 520 ఇండస్ట్రీల నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా నదీజలాలు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి. పటాన్‌చెరు ప్రాంతంలోని నక్కవాగు నుంచి సైతం పారిశ్రామిక జలాలు మూసీలోనికే వస్తున్నాయి. పొల్యుషన్ కంట్రోల్​ బోర్డు(పీసీబీ) రికార్డుల ప్రకారం మూసీకి మొత్తం పన్నెండు హాట్‌ స్పాట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో 2, మేడ్చల్‌లో 1, రంగారెడ్డిలో 2, యాదాద్రిలో 3, సూర్యాపేటలో 2, నల్గొండలో 2 ఉన్నాయి. అంటే హైదరాబాద్‌ నగరంతో పాటు హైదరాబాద్‌ వెలుపల ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాల కారణంగా ఉప నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.

పైన అరకొర శుద్ధి దిగువన అసలే లేదు : పరీవాహకంలోని 520 ఇండస్ట్రీల్లో 194 పరిశ్రమల నుంచి 5.65 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాలు విడుదలవుతుండగా వాటిని శుద్ధి చేసి అక్కడే పునర్వినియోగించుకుంటున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. మిగిలిన 326 పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కామన్‌ ఎఫ్లూయంట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లకు వెళుతున్నాయని, అక్కడ శుద్ధి చేశాక ప్రతిరోజు 4 మిలియన్‌ లీటర్ల జలాలు అంబర్‌పేటలో నదిలో కలుస్తాయని చెబుతోంది.

అయితే, అక్కడ నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి ప్రక్రియ జరిగితే మూసీ ఇంతలా మురికికూపంగా మారదు. అంబర్‌పేట తర్వాత ఉప్పల్, మల్లాపూర్, నాచారం పారిశ్రామికవాడల నుంచి వచ్చే జలాలు, ఉప్పల్‌ నల్లచెరువు కింద కలిసే వ్యర్థాలతో మూసీ తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దిగువన ఘట్‌కేసర్, హయత్‌నగర్, బీబీనగర్, భూదాన్‌ పోచంపల్లి మండలాల్లోని ఇండస్ట్రీలు సైతం మూసీని కలుషితం చేస్తున్నాయి.

అన్నిచోట్లా అత్యంత కలుషితమే! : పీసీబీ అధికారులు ప్రతి నెలా బాపూఘాట్, మూసారాంబాగ్, నాగోల్, ఉప్పల్‌ నల్లచెరువు అవుట్‌లెట్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లి, రుద్రవెల్లి వంతెన, వలిగొండ వంతెన, సోలిపేట, భీమారం, వాడపల్లి ఇలా 12 హాట్‌స్పాట్ల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. వాటి ఆగస్టు గణాంకాలను పరిశీలిస్తే కాలుష్యం తీవ్రత అన్నిచోట్లా ప్రమాదకర స్థాయిని మించినట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైనటువంటి నాలుగు అంశాలను పరిశీలిస్తే.

నాలుగు కీలక అంశాలు :

  • టర్బిడిటీ (మురుగు, మడ్డి): ఈ టర్బిటిడీ అనేది 1-4 పాయింట్ల వరకు ఉండాలి. పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లి తదితర 11చోట్ల పరిమితికి మించి టర్బిడిటీ ఉంది. అధిక టర్బిడిటీ కారణంగా నీటిలోని స్వచ్ఛత అనేది పోతుంది. ఈ జలాలు సూర్యరశ్మిని వెనక్కి నెట్టేస్తాయి. ఫలితంగా నీటిలోపల కాంతి అందక మొక్కలు, ఆక్సిజన్‌ తగ్గి చేపలు మృత్యువాతపడతాయి.
  • టోటల్‌ కొలిఫాం బ్యాక్టీరియా : నీటిలో ఈ టోటల్​ కొలిఫాం బ్యాక్టీరియా అనేది అసలే ఉండొద్దు. కానీ, 7 చోట్ల 350-430 వరకు, 5 చోట్ల 31-63 వరకు ఉండటమనేది గమనార్హం. ఈ నీటిని పొరపాటున తాగితే వెంటనే డయేరియా, జ్వరం బారిన పడే అవకాశం ఉంది.
  • నీటిలో కరిగిన ఆక్సిజన్‌(డీవో) : లీటరు నీటిలో కనీసం 4 ఎంఎం, ఆపైన ఉండాలి. అంతకంటే తక్కువుగా ఉంటే జలచరాలు బతకవు. పరీక్షల్లో 7 చోట్ల డీవో(నీటిలో కరిగిన ఆక్సిజన్) చాలా తక్కువ మోతాదులో ఉన్నట్లు తేలింది.
  • బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీఓడీ) : ఈ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది లీటర్‌ నీళ్లలో 3 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. లేదంటే ఆ నీళ్లు ఉపయోగించడానికి కూడా పనికిరావని అర్థం. సోలిపేట వద్ద మాత్రమే 3 మిల్లీగ్రాముల బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంది. మూసీ జన్మస్థానమైన వికారాబాద్‌ అనంతగిరి గుట్టల్లో తేటగా ఉన్న నది నీరు

జీరో లిక్విడ్‌ డిశ్ఛార్జి విధానం మేలు : జీడిమెట్ల, నాచారం పారిశ్రామికవాడల్లోని డ్రైనేజీలు రసాయన వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఈ డ్రైనేజీల్లోని జలాలు స్థానికంగా ఉన్న చెరువుల్లోకి, తర్వాత మూసీలోకి వెళుతున్నాయి. జీడిమెట్ల సమీపంలోని సుభాష్‌నగర్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో ఇటీవల మ్యాన్‌హోల్‌ నుంచి ఎరుపురంగు నీరు ఉబికి వచ్చి రోడ్లపై పారడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ ప్రాంతాల్లోని భూగర్భజలాలు(గ్రౌండ్ వాటర్) సైతం పూర్తిగా కలుషితమయ్యాయి.

అత్తాపూర్‌లోని బాపూఘాట్‌ బ్రిడ్జి వద్ద పాశమైలారంలోని ఓ పరిశ్రమకు చెందిన కెమికల్‌ వ్యర్థాలను మూసీలో కలుపుతున్న ట్యాంకర్లను స్థానికులు ఇటీవల పట్టుకున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే చిన్నాపెద్ద పరిశ్రమలన్నీ తమ వ్యర్థాలను ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో శుద్ధి చేసుకుని, పునర్వినియోగించుకునే విధంగా జీరో లిక్విడ్‌ డిశ్ఛార్జి విధానాన్ని అమలు చేయాలి. అవసరమైతే వాటికి గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

అందరినీ మురిపించేలా మూసీ! - మరి భారం పడకుండా ఎలా?

ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లోని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందే : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.