తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఊరివాసులు 12 ఏళ్లుగా తాగడం లేదు - ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - NO ALCOHOL VILLAGE KAGIDAMPALLY

12 ఏళ్లుగా మద్యపానం నిషేధం కొనసాగిస్తున్న కాగిదంపల్లి - గ్రామంలో ప్రస్తుతం మంచి ప్రశాంత వాతావరణం ఉందన్న గృహిణులు

ALCOHOL PROHIBITED VILLAGE IN MEDAK DISTRICT
KAGIDAMPALLY VILLAGE BAN LIQUOR SINCE 12 YEARS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 4:35 PM IST

Updated : Nov 19, 2024, 5:05 PM IST

Kagidampally Village ban Liquor : కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయాన్ని ఆ గ్రామం గత 12 ఏళ్ల క్రితమే తీసుకుంది. గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది. మద్యం తాగినా, విక్రయించినా జరిమానాతో పాటు ఇతర శిక్షలు వేస్తామని అందరూ కలిసి దృఢ నిశ్చయం తీసుకున్నారు. ఒకవేళ అలవాటు ఉంటే మానుకునే వరకు ఇతర గ్రామాల్లో సేవించాలని నిబంధనలు విధించారు. ఊళ్లో మద్యం సీసా కనబడితే సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయితీకి రావాల్సిందేనని హెచ్చరించారు. అంతటి ఆదర్శ గ్రామం ఆ కఠిన నిర్ణయాలు అమలవుతున్న తీరు తెన్నులపై ప్రత్యేక కథనం.

మెదక్‌ జిల్లా అల్లాదుర్గం పరిధిలోని కాగిదంపల్లిలో పన్నేండేళ్ల క్రితం గ్రామంలో పూర్తిగా మద్యపానాన్ని నిషేధించాలని గ్రామపెద్దలు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి గ్రామస్థులందరూ కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకుని 12 ఏళ్లు పూర్తయ్యింది. అయినా వారి నిర్ణయంలో ఎటువంటి మార్పు రాకపోక గ్రామస్థులు ఏకతాటిపై నడుస్తూ సోదరభావంతో ముందుకెళ్తున్నారు.

విక్రయిస్తే రూ.2 లక్షల జరిమానా : కాగిదంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మరో మూడు గ్రామాల ప్రజలు మద్యపాన నిషేధాన్ని తూచాతప్పక పాటిస్తున్నాయి. అప్పాజీపల్లిలో మద్యపానం సేవించడం వల్ల గొడవలు పెరిగిపోతున్నాయనే కారణంగా నిషేధానికి మూకుమ్మడి తీర్మానానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మద్యం విక్రయిస్తే రూ. 2 లక్షల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల నజరానా ప్రకటించుకున్నారు. నేటికీ అదే మాదిరిగా మద్యపాన నిషేధం సజావుగా సాగుతుండడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని గ్రామస్థులు అంటున్నారు.

నేటి యువత ఎక్కువ శాతం జల్సాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గ్రామంలో మద్యం షాపులు లేకపోవడంతో ఆ దిశగా వారి ఆలోచనలు కూడా వెళ్లడం లేదు. బయటకు వెళ్లినప్పుడు వారి పనులు చూసుకుని సమయానికి తమ ఇళ్లకు చేరుతున్నారు. నేటి తరానికి ఆనాటి పెద్దల తీర్మానం ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది. గ్రామస్థులందరూ పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమవ్వడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయి. సాయంత్రం కాగానే పెద్దలందరూ రచ్చబండ వద్ద కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. తమ గ్రామం చుట్టు పక్కల ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు.

గ్రామ పెద్దల ఆలోచనలతో బీజం వేసుకున్న మద్యపాన నిషేధం భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశాలుగా మారుతున్నాయి. కాగిదంపల్లిని అన్ని గ్రామాలు ఆద‌ర్శంగా తీసుకుంటే రాష్ట్రంలోనూ క్రైం రేటు తగ్గే అవకాశమూ ఉంది.

మద్యం షాపుల్లో వాటా - లేదంటే ఏటా రూ. 30 లక్షలు కట్టాలని డిమాండ్
మద్యం షాపుల వారికి హెచ్చరిక - మొదటి తప్పునకు రూ.5 లక్షల జరిమానా

Last Updated : Nov 19, 2024, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details