NHRC Notices To DGP In Sandhya Theater Incident :సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులను జారీ చేసింది. డిసెంబరు 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయవాది రామారావు నేషనల్ హ్యూమన్‌రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
సంధ్య థియేటర్ ఘటన - డీజీపీ, హైదరాబాద్ సీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు - SANDHYA THEATER INCIDENT
డీజీపీ, హైదరాబాద్ సీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు - సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరపాలని చెప్పిన ఎన్‌హెచ్‌ఆర్సీఘటనపై 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం
Published : Jan 1, 2025, 8:32 PM IST
|Updated : Jan 1, 2025, 8:52 PM IST
ప్రీమియర్ షోకి హీరో అల్లు అర్జున్ రావడం, పోలీసులు లాఠీఛార్జ్ చేయడం వల్లే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందిందని, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ సంధ్య థియేటర్ ఘటనపై సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో కమిషన్ పేర్కొంది.