Nara Lokesh Criticizes CM Jagan Stone Attack Injury: సీఎం జగన్ గులకరాయి గాయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP National General Secretary Nara Lokesh) విమర్శలు చేశారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్ బ్యాండేజ్ మాయమైందంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ముఖంపై జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అయ్యిందని ఎద్దేవా చేశారు. కోడి కత్తి కమల్ హాసన్ అంటూ జగన్ ఫోటోలను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతలో లోకేశ్ జత చేశారు.
'జగన్ ప్రభుత్వం పోతే తప్ప రాష్ట్రంలో అడుగుపెట్టను- ఏపీలో మహిళలకు రక్షణలేదు' - Arudra Fires on YSRCP government
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకేలకు నుదుటిపై ఉన్న బ్యాండేజ్‌ను తీసేశారు. గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13 సీఎం జగన్ నుదుటికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్యాండేజ్ సైజును రోజు రోజుకి పెంచుకుంటూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు సైతం జగన్ బ్యాండేజ్‌తో రావడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్ వివేకానంద కుమార్తె సునీత సైతం గాయంపై అన్ని రోజులు బ్యాండేజ్ ఉంటే సెప్టిక్ అవుతుందని చెప్పడం, మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ (CM Jagan injury Trolls) మొదలవడంతో బ్యాండేజీ తొలగించి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ నారా లోకేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
'మాకేం తెలుసు ఈ మాండేటరీ' - వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లలో తప్పుల కుప్పలు - Complaints on YSRCP Nominations
Set Fire To Tdp Campaign Vehicle:దారుణ పరాజయం తప్పదనే భయంతో వైఎస్ జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నాడని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు పెట్టడం వైసీపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. డ్రైవర్ ఉంటుండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన మీ రాక్షసత్వం సభ్యసమాజానికే సిగ్గుచేటు జగన్ అని మండిపడ్డారు. ఐదేళ్ల అరాచకాలకు అండగా నిలిచిన అధికారం కోల్పోయే ముందైనా పశ్చాత్తాపం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసిన ప్రతి నేరం, ప్రతి ఘోరానికి చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
నవనందుల నంద్యాల లోక్‌సభ - వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు - Nandyala Lok Sabha Constituency