Minority Voters Verdict in Secunderabad Constituency :దేశంలో భిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు మైనార్టీల సంక్షేమానికి కృషిచేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్న నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటిగా ఉంది. ఇక్కడ మహిళల కంటే పురుషులు 53,479 మంది అధికంగా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 21,20,550 ఓటర్లు ఉన్నారు.
Secunderabad Parliamentary Total Voters :ఇందులోపురుషులు 10,86,875 మంది ఉండగా, మహిళలు 10,33,396 ఉన్నారు. అంతేకాక 130 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు, 149 సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో సుమారు ఐదు లక్షల ముస్లిం మైనార్టీ ఓటర్లే ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు సిట్టింగ్ అభ్యర్థులే పోటీచేస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కిషన్రెడ్డి, కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ తరఫున సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావుగౌడ్లు పోటీ చేస్తున్నారు.
మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం
2019 లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లతో ఆధిక్యం సాధించగా, గులాబీ పార్టీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్కు 3,22,666 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్కు 1,73,229 ఓట్లు వచ్చాయి. తమ ప్రభుత్వ హయాంలో షాదీ ముబారక్ అందజేశామని, ముస్లిం మైనార్టీలకు అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను అందించామని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని, ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందని, లోక్సభ ఎన్నికల్లో హస్తానికి అండగా ఉండాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.