తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేటీఆర్‌ ఇక నుంచైనా నిజాలు తెలుసుకుని మాట్లాడండి' - ఎంపీ చామల కిరణ్‌ కౌంటర్ - MP Chamala Fires on KTR - MP CHAMALA FIRES ON KTR

Chamala Kiran Kumar Reddy on Tweet : కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం గురించి తప్పుడు ట్వీట్‌ చేశారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్‌ చేయడం సరికాదని, ఇకనుంచి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు తెలుసుకొని చెప్పాలని సూచించారు.

Chamala Kiran Kumar Reddy Fires on KTR
Chamala Kiran Kumar Reddy Fires on KTR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 7:41 PM IST

Chamala Kiran Kumar Reddy Fires on KTR : 'ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌' జాబితాలో తెలంగాణ ఆఖరి స్థానాల్లో నిలిచిందని అది కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతోందని కేటీఆర్‌ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ స్పందించారు. ప్రభుత్వం గురించి తప్పుడు ట్వీట్ చేశారని ఆరోపించారు.

ట్వీట్ చేసి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు : నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. గడిచిన ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి కేటీర్ ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. ఎక్స్‌లో ఏదొక ట్వీట్ రెగ్యులర్‌గా పోస్ట్ చేసి ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉందన్న విషయం జీర్ణించుకోలేక ఎక్స్‌లో కాంగ్రెస్ గురించి తప్పుగా పెడుతున్నారని విమర్శించారు.

'ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులు పరిహారం కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలి' - KTR Latest Tweets

ఇంగ్లీష్‌ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసి పోస్ట్‌ : 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్స్ విషయంలో తెలంగాణ టాప్ టెన్‌లో లేకుండా పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేశారని ఆరోపించారు. దేని ఆధారంగా ఈ ర్యాంక్ జాబితా తీసుకున్నారో తెలుసుకునే ఆలోచన లేకుండా ఎక్స్ వేదికపై ఆలా ట్వీట్ చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.

"పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌ మీకూ బాధ్యత ఉంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ మీ హయాంలో ఉన్నటువంటి రీఫామ్స్‌ ప్రకారం ఇచ్చిన ర్యాంకింగ్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదంగా చూపించడం చాలా తప్పు." - చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ

'బిజినెస్ రీఫామ్స్ యాక్షన్ ప్లాన్ - 2022'లో ఉన్న గ్రాఫ్‌ను, విధివిధానాలను తీసుకొని ఇప్పుడు ప్రకటన చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి విధి విధానాలను, కార్యాచరణ తీసుకొని ఈ ఆర్టికల్ ప్రచురించిన సంగతి తెలుసుకోలేదని విమర్శించారు. కేటీఆర్ ఏదైనా ట్విట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు అయినా, సరియైన నివేదికలు, గ్రౌండ్ రిపోర్ట్‌ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

రాజీనామా చేయమంటే - హరీశ్​రావు నాటకాలు ఆడుతున్నారు : ఎంపీ చామల - chamala Kiran kumar on Harish Rao

కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది : హరీశ్​రావు - Harish Rao Slams Congress Govt

ABOUT THE AUTHOR

...view details