Rangareddy Double Murder Case : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణహత్యకు గురైన యువతి, యువకుడి వివరాలను పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : యువకుడు మధ్యప్రదేశ్‌కి చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. సాకేత్ హౌస్ కీపింగ్ పనిచేస్తూ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. యువతి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు(25)గా గుర్తించారు. ఆమె ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటోంది. ఈనెల 3న బిందు అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బిందుకి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
వివాహేతర సంబంధం : మృతిచెందిన అంకిత్ సాకేత్‌పై ఈనెల 8న గచ్చిబౌలి పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. మృతులిద్దరికీ పరిచయం ఉందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాకేత్ ఈనెల 8న బిందుని తీసుకొచ్చి నానక్‌రామ్‌గూడలోని తన స్నేహితుడి వద్ద ఉంచాడు. ఈ నెల 11న రాత్రి హత్య జరిగి ఉంటుందని, వీరి హత్యకు కారణం వివాహేతర సంబంధం అయి ఉండొచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుమార్తెతో అసభ్య ప్రవర్తన - భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
ఫ్రెండ్ వివాహేతర సంబంధానికి సాయం - 3 రోజులకే శవమై తేలిన యువకుడు