తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేట జిల్లాలో విషాదం - భారీ వర్షానికి ఇంటి గోడ కూలి తల్లీకుమార్తె మృతి - Two People Died Due To Rains - TWO PEOPLE DIED DUE TO RAINS

Two People Died After Wall Collapsed Due To Rains : నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎక్కమేడ్ గ్రామంలో విషాదం నెలకొంది. భారీ వర్షాల కారణంగా గోడ కూలి ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకుమార్తె మృతి చెందారు.

Heavy Rains in telangana
Two People Died After Wall Collapsed Due To Rains (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 9:05 AM IST

Updated : Sep 1, 2024, 12:03 PM IST

Two People Died After Wall Collapsed Due To Rains : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, కుమార్తె మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని ఏక్​మేడ్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని ఏక్​మెడ్ గ్రామంలో హనుమమ్మ (70), అంజిలమ్మ (35) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంటిపై కప్పు ఊడి తల్లీకుమార్తెపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుమార్తె అంజిలమ్మ తన భర్త చనిపోవడంతో తల్లి వద్దే ఉంటుంది. తల్లి, కుమార్తె ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Sep 1, 2024, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details