Mohan Babu Filed Complaint Against Son Manchu Manoj :రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ముందు సినీ నటుడు మంచు మనోజ్ శనివారం విచారణకు హాజరయ్యారు. తాను సంపాదించిన ఇల్లు, ఆస్తులు మంచు మనోజ్ ఆక్రమించారంటూ మోహన్‌బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం తన ప్రతినిధితో లేఖను పంపించారు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
మంచు మనోజ్‌కు నోటీసులు :మోహన్ బాబు ఫిర్యాదుకు స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు చట్టం ప్రకారం మంచు మనోజ్‌కు వారం క్రితం నోటీసులు పంపించారు. వీటికి సమాదానమిచ్చేందుకు మనోజ్ కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌కు వచ్చారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మోహన్‌బాబు ప్రతినిధి గత నెల కలెక్టరేట్‌కు వచ్చి తనను కలిసి కుమారులు, ఆస్తుల గురించి వివరించి ఫిర్యాదు చేశారని కలెక్టర్ సి.నారయణరెడ్డి చెప్పారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా విచారణ నిర్వహించేందుకు ట్రైబ్యునల్ కార్యాలయం ద్వారా మనోజ్‌కు నోటీసులు పంపించామని తెలిపారు.