MLC Kavitha on Women Reservation : అణగారిన వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇటీవల జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లో రోస్టర్ పాయింట్లు ఇవ్వకుండా, హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారని విమర్శించారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వాపోయారు. రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించగలరా అని ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు.
kavitha Demand Cancel GO NO 3 : 546 గ్రూప్-1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారనికవిత (MLC Kavitha) ప్రశ్నించారు. రోస్టర్ పాయింట్లను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని, మహిళల ప్రయోజనాలను, హక్కులను తెలంగాణ సర్కార్ కాపాడాలని కవిత ట్వీట్ చేశారు.
ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
ఇటీవలే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, క్రీడాకారుల కేటగిరీల్లో ఈ మేరకు అమలు చేయనున్నట్లు తెలిపింది. మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల(వర్టికల్) అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం.56/1996 ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు వివరించింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, రాజ్యాంగ నియామక సంస్థలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాలకు సమాంతర రిజర్వేషన్లు వర్తిస్తాయని జీవోలో వెల్లడించింది.
ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి టీఎస్‌పీఎస్సీ పరిధిలో కొనసాగుతున్న నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన జీవో, మెమో ప్రకారం మహిళలకు రోస్టర్ పాయింట్లు కేటాయించకుండా సమాంతర రిజర్వేషన్లతో నియామకాలు చేస్తామని తెలిపింది. ఈ నియామకాలన్నీ హైకోర్టు తుదితీర్పునకు లోబడి ఉంటాయని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.
మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది : ఎమ్మెల్సీ కవిత
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే?