తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? : ఎక్స్ వేదికగా ప్రశ్నించిన కవిత

అదానీ వ్యవహారంపై 'ఎక్స్‌'లో స్పందించిన ఎమ్మెల్సీ కవిత - ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? అని ట్వీట్ - బెయిల్​పై విడుదలైన తరువాత తొలిసారిగా ట్వీట్ చేసిన కవిత

KAVITHA ABOUT ADANI CASE AND ARREST
MLC Kavitha Reacts on Adani Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

MLC Kavitha Reacts on Adani Case :సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందం కోసం 5 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు ఆదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసుపై బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్​ వేదికగా స్పందించారు. ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? అని కవిత ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా, ఆడబిడ్డను అరెస్టు చేయడం మోదీ సర్కార్​కు ఎలాంటి అడ్డంకులు ఉండవన్నారు. అదే ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా అని ప్రశ్నించారు.

ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా, అదానీ వైపే ప్రధాని ఉంటారా అని కవిత తెలుగు, ఇంగ్లీష్​లో చేసిన ట్వీట్లలో పీఎం నరేంద్ర మోదీని ప్రశ్నించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయడంతో తిహాడ్​ జైలులో ఉన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 164 రోజుల తరువాత బయటకు వచ్చారు. కవిత హైదరాబాద్ వచ్చిన తరువాత ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించడం ఇదే తొలిసారి.

అమెరికాలో అదానీ సహా ఏడుగురిపై కేసు : అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై నమోదైన కేసుతో స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు కుప్పకూలాయి. ఆయన కంపెనీల షేర్లు పది నుంచి 22 శాతం వరకు నష్టపోయాయి. సౌరవిద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదానీ గ్రూప్ రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచాలు తీసుకున్న వారిలో అప్పటి ఏపీ సీఎం జగన్​ మోహన్​ రెడ్డికి కూడా రూ.1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.

అదానీ స్కామ్‌ సొమ్ములో జగన్‌ రెడ్డికి వాటాలు! - ఆ​నాటి ఒప్పందం గురించి చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఎఫ్‌బీఐ

ABOUT THE AUTHOR

...view details