తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇన్‌స్టాలో పరిచయం, ఫ్రెండ్​ రూమ్​లో వివాహం - ఆ తరువాత! - MIYAPUR MURDER CASE

హైదరాబాద్​లోని మియాపూర్‌లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం - తుక్కుగూడలోని కనుగొన్న పోలీసులు - నవంబరు 10న కనిపించకుండా పోయిన బాలిక - ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన వ్యక్తి హంతకుడు

Miyapur Murder Case
Miyapur Murder Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 10:44 PM IST

Updated : Nov 19, 2024, 7:44 AM IST

Miyapur Murder Case : ఓ మైనర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో యువకుడు పరిచయం అయ్యాడు. అతడు చెప్పిన మాయమాటలు విన్న బాలిక.. తనే సర్వస్వం అనుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయి రహస్యంగా వెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన రోజు రాత్రే అతగాడి నిజస్వరూపం బయటపడింది. కాలయముడిలా తన స్నేహితుడి, స్నేహితుడి భార్యతో కలిసి యువతిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని తుక్కుగూడ వద్ద జరిగింది. మియాపూర్‌లో అదృశ్యమైన యువతి.. ఇలా తుక్కుగూడలో మృతదేహమై కనిపించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు చింటు, అతడి ఫ్రెండ్ సాకేత్ (ETV Bharat)
వారం రోజుల క్రితం అదృశ్యమైన బాలిక - కుళ్లిన స్థితిలో లభించిన మృతదేహం (ETV Bharat)

మియాపూర్‌ సీఐ క్రాంతి కుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం, మియాపూర్​కు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఈనెల 10న ఫిర్యాదు చేశారు. 20 రోజుల క్రితం యువతి స్నేహితుడు చింటు అలియాస్‌ విఘ్నేశ్‌ దగ్గరకు వెళ్లిందని తల్లిదండ్రులు చెప్పారు. ఈనెల 8వ తేదీ నుంచి కుమార్తె ఫోన్‌ చేయడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఫిర్యాదులో చింటుపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. చింటుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం విషయం బయటపడింది.

ఆ యువతిని చింటు ఉప్పుగూడలోని తన స్నేహితుడు సాకేత్‌ ఇంట్లో ఉంచాడు. యువతి పెళ్లి చేసుకోవాలని చింటును బలవంతం పెట్టింది. దీంతో ఇంట్లోనే వాళ్లు దండలు మార్చుకుని.. యువతి ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఇదంతా పథకం ప్రకారమే చింటు నాటకం ఆడాడు. యువతిని అడ్డుతొలగించేందుకు పెళ్లి నాటకం ఆడాడు. ఈ పథకాన్ని అతడి స్నేహితుడు సాకేత్‌, సాకేత్‌ భార్యకు చెప్పాడు. ఈ ముగ్గురు కలిసి పథకం వేశారు.

తరువాత చింటు స్నేహితులు ఉప్పుగూడ నుంచి మీర్‌పేట్‌కు నివాసం మార్చారు. చింటు అతని స్నేహితుడు, అతని భార్య యువతిని దిండుతో తలపై మూసి హత్య చేశారు. అనంతరం శ్రీశైలం మార్గంలో నిర్మానుష్య ప్రాంతాల్లో పడేశారు. పోలీసుల దర్యాప్తులో చింటునే హత్య చేశాడని తేలినట్లు సీఐ క్రాంతి కుమార్ తెలిపారు.

హత్య అనంతరం పథకంలో భాగంగా చింటు యువతి ఇంటికి మాటిమాటికి ఫోన్‌ చేసి మీ అమ్మాయి వచ్చిందా అని అడిగేవాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆ దిశగా దర్యాప్తు జరిపి చింటూనే హత్య చేశాడని గుర్తించాం - క్రాంతి కుమార్, సీఐ మియాపూర్

భార్యపై అనుమానంతో హత్య - ఆపై అగ్నిప్రమాదంగా చిత్రీకరించిన భర్త

ఒకే ఇంట్లో ఇల్లాలు, ప్రియురాలు - ఆరేళ్లుగా అంతా సాఫీగా - ఆ ఒక్క కారణంతో?

Last Updated : Nov 19, 2024, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details