Ministers Review Meeting on Medaram Jatara: మేడారం జాతర సమీపిస్తుండటంతో సమ్మక్క, సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీ దృష్యా రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas Reddy), సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. రద్దీ దృష్ట్యా ఎక్కువ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మేడారం జాతరలో పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించినట్లు మంత్రులు పేర్కొన్నారు.
Seethakka on Medaram Arrangements: ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క సమీక్ష సమావేశం(Ministers Review Meeting) నిర్వహించారు. ఈ మహాజాతర వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తూ బడ్జెట్ కేటాయిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు రావడం ఇదే తొలిసారని వెల్లడించారు. రెండు నెలల నుంచి అధికారులు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. భక్తులు క్రమశిక్షణతో రావాలని సూచించారు.
ములుగు జిల్లా, మేడారం ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తాం : మంత్రి సీతక్క
Ponguleti on Sammakka Saralamma Jatara : వీఐపీలు వాహనాలు ములుగులోనే ఉంచి బస్సుల్లో మేడారానికి రావాలని మంత్రి సీతక్క సూచించారు. భక్తులకు ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతర విజయవంతానికి సహకరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. జాతర కోసం ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయి ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. తల్లుల చరిత్రను శిలాశాసనం చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.