తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ కార్యక్రమం ప్రారంభం - లక్ష కోట్ల రుణాల దిశగా అడుగులు - minister Seethakka serp plan - MINISTER SEETHAKKA SERP PLAN

Minister Seethakka Unveiled SERP Annual Plan : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మహిళలకు రూ.20వేల కోట్లను స్వయం సహాయక సంఘాలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు- బ్యాంక్ లింకేజీ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు.

Minister Seethakka Unveiled SERP Annual Plan
Minister Seethakka On SERP Plan 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 3:12 PM IST

Minister Seethakka On SERP Plan 2024 : మహిళాశక్తి పథకం కింద వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్‌లో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో స్వయం సహాయక సంఘాలు- బ్యాంక్ లింకేజీ 2024-25 వార్షిక రుణప్రణాళికను ఆమె విడుదల చేశారు. మహిళ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఆంక్షలు విధిస్తారని మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా అందరూ మారాలని సూచించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 10 వేల నుంచి లక్షల్లో రుణాలు తీసుకునే స్థాయికి మహిళలు చేరుకోవాలని మంత్రి ఆకాక్షించారు.

Women Empowerment Through SERP : స్వయం సహాయక బృందాల సాయంతో.. 'మిలియనీర్లుగా మహిళలు'

గత పదేళ్లలో అద్భుత ప్రగతి సాధించామని సెర్ప్ సీఈఓ అనిత రామచంద్రన్ పేర్కొన్నారు. పదేళ్ల క్రితం స్వయం సహాయక సంఘాలకు రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు రూ.3వేల 761.36 కోట్ల అప్పులిస్తే ఇప్పుడు రూ.15వేల 453.19 కోట్లకు చేరుకుందని వివరించారు. మరికొన్ని బ్యాంకులతో స్వయం సహాయక సంఘాలని అనుసంధానిస్తూ రూ.20 వేల కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

"చాలా మంది కోటీశ్వరుల వెనుక ఒక పేదరికం కథ ఉంటుంది. వాళ్లు అనుభవాలను పంచుకోవడం వల్ల ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుంది. పేదలకు నమ్మకం కలుగుతుంది. రామోజీ రావు ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఒక మీడియాకు అధినేతగా ఎదిగారు. ఇలా చాలమంది ఉంటారు. వాళ్లను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి నమ్మేది ఏంటంటే మహిళలు ఎక్కడైతే ఆర్థికంగా, సామాజికంగా మంచిగా ఉంటారో అక్కడ సమాజం బాగుంటుందని అంటారు." - సీతక్క, మంత్రి

గతంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పొందిన లాభాల గురించి రంగారెడ్డి, మాహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన మహిళలు తమ అనుభవాలు పంచుకున్నారు. తాము ఆర్థికంగా, సామజికంగా మెరుగైనట్లు సంతోషం వ్యక్తం చేశారు. మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు.

స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క (ETV Bharat)

Dwakra mahila sangam Warangal : 'మహిళలు బాగుంటే.. రాష్ట్రం బాగుంటుంది'

సిద్దిపేట సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే - తదుపరి విచారణ జూన్ 18కి వాయిదా - Telangana HC Stay on SERP Employees

ABOUT THE AUTHOR

...view details