Minister Ponnam Prabhakar Comments : దేశం మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు, బాధ్యతలు హరింపబడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పనుల కోసమో, నిధుల కోసమో గవర్నర్ని కలిసే పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఐదు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులను శాలువాలతో సన్మానించారు. ప్రజా జీవితంలో ఐదు సంవత్సరాలు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఏదీ శాశ్వతం కాదనీ ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి, ప్రజాస్వామ్య బద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసి, కొన్ని చేయకపోవచ్చనీ, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు.
అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా 7 పైసలు కూడా విడుదల చేయలేదు: హరీశ్ రావు
Honoring Program Of Mandal Praja Parishad Members :చట్ట సభల్లో కేటాయించబడ్డ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరవేసే వేదిక మండల ప్రజా పరిషత్ అని, ఎన్నికల్లో మనం పని చేసిన దానికి అది నిదర్శనంగా ఉంటుందన్నారు. మళ్లీ అందరూ ప్రజా ప్రతినిధులుగా రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కష్టపడిన వారందరికీ మళ్లీ అవకాశాలు వస్తాయని, తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు లోపల కొట్టుకున్న బయట కలిసి ప్రజా సమస్యల పై కలిసి మాట్లాడే వాళ్లమని అదే ప్రజాస్వామ్య విలువ అన్నారు. తనకు మంత్రులతో ఉన్న సాన్నిహిత్యంతో అన్ని పనులు చేయడానికి కృషి చేస్తున్నానన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు.