తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్' - మంత్రి లోకేశ్​ ధ్వజం - nara lokesh tweet on YSRCP Offices

Nara Lokesh on YSRCP Offices: ఏపీలోని రాజమహళ్లను తలపించే వైఎస్సార్సీపీ కార్యాలయాలు కేవలం ఒక్క విశాఖకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. అవి కూడా కేవలం ఎకరాకు రూ.1000 నామమాత్రపు లీజు ధరకు మాత్రమే. దీనిపై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.

Nara Lokesh on YSRCP Offices
Nara Lokesh on YSRCP Offices (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 12:16 PM IST

YSRCP Offices being Construct Illegally in Govt Places in AP :ఏపీలో వైఎస్సార్సీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూమిని కేటాయించడంపై మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. 'ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్‌' అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా రూ.1000ల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు జగన్‌ కేటాయించుకున్నారని మండిపడ్డారు. జనం నుంచి దోచుకున్న డబ్బులో రూ.500 కోట్లలతో జి‌ల్లాల్లో జగన్‌ వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మించారని' మంత్రి లోకేశ్ విమర్శించారు.

జగన్‌ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.500 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చన్నారు. జగన్‌ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చని అన్నారు. జగన్​కు ఈ ప్యాలెస్‌ల పిచ్చి ఏంటని విమర్శించారు. ఆయన ధనదాహానికి అంతులేదా అని నిలదీశారు.

రెండు కళ్లూ పొడిచేశారు! - విలువల విధ్వంసానికి ప్రతీకగా ప్రజావేదిక - SYMBOL OF DESTRUCTION IN AP

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యాలయాల చిట్టా:అయిదేళ్లుగా రాష్ట్రంలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వైఎస్సార్సీపీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు సైలెంట్​గా నిమ్మకుండిపోయారు.

  • శ్రీకాకుళం జిల్లాలో ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. దీనిని 33 సంవత్సరాలకు ఎకరా రూ.1000 చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు.
  • విజయనగరం జిల్లాలో చెరువు గర్భం స్థలాన్ని డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో భారీ భవనం నిర్మిస్తున్నారు.
  • పార్వతీపురం మన్యం జిల్లాలో ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు.
  • విశాఖ ఎండాడలో రూ.100 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. తాజాగా ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు నోటీసులు అంటించారు.
  • అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమి ఇచ్చారు.
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా ఇచ్చారు.
  • కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాలను నిర్మిస్తున్నారు.
  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కార్యాలయం నిర్మిస్తున్నారు.
  • నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం చేపడుతున్నారు.

సీఎం పీఠంపై మరో 30ఏళ్లు - రుషికొండపై కలల​ ​రాజప్రాసాదం కథ అదే! - Rushikonda Palace

ABOUT THE AUTHOR

...view details