Komati Reddy Open Challenge to KTR : పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణలో అధికార, విపక్ష నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komati Reddy), బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. సిరిసిల్లలో ఎవరి దమ్ము ఎంతో ఇద్దరం పోటీ చేసి తేల్చుకుందామని పిలుపునిచ్చారు. కేటీఆర్ రాజీనామా చేసి సిరిసిల్ల పోటీ చేస్తే, తాను కూడా నల్గొండలో రాజీనామా చేసి వస్తానన్నారు.
Minister Komati Reddy VS KTR :సిరిసిల్లలో కేటీఆర్‌పై తాను ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఒకవేళ కేటీఆర్(KTR) ఓడిపోతే బీఆర్‌ఎస్ పార్టీని మూసివేస్తామని కేసీఆర్ ప్రకటన చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల మల్కాజిగిరి ఎంపీగా ఇరువురం తేల్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ విసిరిన సవాల్‌కు మంత్రి కోమటిరెడ్డి స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.
Minister Komati Reddy Fires on MP Arvind :రైతుబంధు నిధుల్లోంచి తాను 2వేల కోట్ల రూపాయల బిల్లులు తీసుకున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కేవలం టీవీల్లో బ్రేకింగ్ వార్తల కోసం ఏదేదో మాట్లాడతారని మంత్రి ఎద్దేవా చేశారు. తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆస్తులు తగ్గిపోయాయన్నారు. తమ ఆస్తులు పెరిగినట్లు చూపిస్తే ఆయనకే ఇచ్చేస్తామన్నారు.
రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్ - మల్కాజిగిరి ఎంపీ బరిలో తేల్చుకుందామంటూ సవాల్