తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి మూడు టాస్క్​ఫోర్స్​లు : మంత్రి రాజనర్సింహ - Damodar Raja Narasimha Face to Face - DAMODAR RAJA NARASIMHA FACE TO FACE

Minister Damodar Raja Narasimha Face to Face Interview : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సర్వే చేయకుండా వైద్య కళాశాలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఆయా కళాశాలల్లో మెడికల్​ ప్రొఫెసర్లు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

Minister Damodar Raja Narasimha Face to Face Interview
Minister Damodar Raja Narasimha Face to Face Interview (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 6:49 PM IST

Chit Chat with Telangana Health Minister Damodar Raja Narasimha : రాష్ట్రంలో వైద్య ఆరోగ్యానికి సంబంధించి మూడు రకాల టాస్క్​ఫోర్స్​లను ఏర్పాటు చేయబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల పర్యవేక్షణకు క్లినికల్​ ఎస్టాబ్లిష్​, ఫార్మా మెడికల్​లో డ్రగ్స్​ నియంత్రణకు, ఫుడ్​ క్వాలిటీ కోసం ఇలా మూడు టాస్క్​ఫోర్స్​లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మీడియాతో జరిగిన చిట్​చాట్​లో ఆయన వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే గత ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మంత్రి విమర్శలు చేశారు.

ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్​ ఛానల్​ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గత ప్రభుత్వం గవర్నమెంటు మెడికల్​ కాలేజీలు ప్రాంతాల వారీగా సర్వే చేయకుండా అవసరం లేకుండా ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు మెడికల్​ కాలేజీల్లో ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందుకే మెడికల్​ ప్రొఫెషన్ ఎప్పుడూ​ స్లోగా పెరగాలని హితవు పలికారు. ప్రతి 35 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలా కొత్తగా 75ట్రామా కేర్​ సెంటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. డయాగ్నోస్టిక్​ సెంటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు లింక్​ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిని గాలికొదిలేశారు : సిద్దిపేట ఆసుపత్రిపై దృష్టి పెట్టి ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ధ్వజమెత్తారు. పదేళ్లు పాలించి కనీసం ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా కట్టలేదన్నారు. సిటీకి పక్కనే ఉన్న మహేశ్వరానికి మెడికల్​ కాలేజీ ఎందుకు ఇచ్చారో తెలియదని తెలిపారు. ఇంజినీరింగ్​ కాలేజీల మాదిరిగా మెడికల్​ కాలేజీలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.

కేసీఆరే డాక్టర్​ అయ్యాడు, కేసీఆరే ఇంజినీర్​ అయ్యాడు, కరోనాకు పారాసిటమాల్​ తీసుకొమ్మని చెప్పి, కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన్నే డిజైన్​ చేశారని మంత్రి దామోదర నర్సింహ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో4 సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.9 వేల కోట్లను లోన్ రూపంలో తీసేసుకున్నారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్​ కిట్​లో మార్పులు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు దిశగా ప్రతి ఒక్క అధికారి పని చేయాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

KTR Speech at Sircilla Government Medical College Inauguration : 'ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్​ వన్​గా ఉంది'

ABOUT THE AUTHOR

...view details