Mini Medaram Jatara in Hanamkonda : మేడారం తర్వాత అత్యంత పేరు గాంచిన జాతర అగ్రంపాడులోని సమ్మక్క సారలమ్మ జాతర. మినీ మేడారంగా పిలవబడే అగ్రంపాడు జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వారం రోజుల నుంచే భక్తులు అత్యధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి నేరుగా మినీ మేడారానికి వచ్చి అగ్రంపాడులోని వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Agrampahad Sammakka Saralamma Jatara 2024 :హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలో మినీ మేడారంగా పిలుచుకునే సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. గత రెండు వారాల నుంచి అమ్మవార్లకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఈ జాతరను దర్శించుకుంటారు. గతేడాది అగ్రంపాడు సమక్క సారక్క జాతరకు 20 లక్షల మందికిపైగా భక్తుల వచ్చారు. ఈ సారి 30లక్షల వరకు భక్తులు రావొచ్చని దేవాలయం అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మినీ మేడారం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర - ఈ విషయాలు తెలుసా?
"మేము ప్రతి సంవత్సరం ఈ జాతరకు వస్తాం. ఇక్కడ అమ్మవార్లను దర్శించుకుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మేడారం జాతర మొదలైతే బాగా భక్తుల రద్దీ ఉంటుంది. అందుకే ముందుగా వచ్చి దర్శించుకున్నాం. ప్రస్తుతానికి ఏర్పాట్లు బాాగానే జరుగుతున్నాయి. ఇంకా జాతర మొదలయ్యే సరికి అన్ని వసతులు కల్పిస్తే భక్తులందరు చాలా సంతోషిస్తారు." - భక్తుడు