Bar Association Cricket Tournament Hyderabad : మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ ప్రారంభించారు. ఉప్పల్ పీర్జాదిగూడలోని క్రికిట్ స్టేడియంలో రెండు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఈ టోర్నమెంట్లో 13 బార్ అసోసియేషన్ల న్యాయవాదులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ కార్తీక్‌లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
"అడ్వకేట్‌లంటే అబద్ధాలు ఆడాలి కానీ ఇంత అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే నన్ను స్పోర్ట్స్‌మెన్ అంటే నాకే నవ్వు వచ్చింది. బంతి పట్టుకుని బౌలింగ్ వేయరాని వ్యక్తి, ఎన్నడూ బ్యాట్ పట్టుకోని వ్యక్తి, క్రికెట్ ఆడతావుంటే దూరం నుంచి చూసిన వ్యక్తి ఈ ఆటలను ప్రారంభించడమే గొప్ప హాస్యం. జీవితం ఒక ఆట దాన్ని అలానే ఆడుకోండి. గెలుపు ఓటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలి అంతే" -జస్టిస్ నగేశ్ భీమపాక