Mellacheruvu Mahashivaratri Jatara 2024 :సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శివాలయాన్ని కాకతీయులు క్రీస్తుశకం.1311 లో నిర్మాణం చేసినట్లు ఇక్కడున్న శిలాశాసనంలో రాసి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాతన కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు లింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి. దేశంలోనే అతికొద్ది దర్శనీయ దైవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో స్వామి లింగాకారంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ శివలింగంప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొంత శివలింగం పెరుగుతూ ఉంటదని స్థానికులు చెపుతూ ఉంటారు. శివలింగంమీద ఒక చిన్న రంధ్రం ఉంది. అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అందులో నీళ్లు ఎన్నిసార్లు తీసిన మళ్లీ జల ఊరుతూనే ఉంటుంది.
మహా శివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి?
అందుకే సాక్షాత్తు గంగమ్మ కొలువై ఉందని చెబుతుంటారు. ద్వీలింగం కావడం వల్ల సగభాగం పార్వతి దేవి మరో సగభాగం శివుడుగా అర్ధనారీశ్వర రూపంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. శివలింగానికి ఐదు చోట్ల బొట్టు పెట్టినట్లు ఒక మార్కు ఉంటుంది. శివలింగం పెరుగుతున్న కొద్దీ ఆరో బొట్టు ఏర్పడుతుంది. వెనుక భాగంలో పార్వతి దేవి అమ్మవారి కురుల ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ క్షేత్రం వెయ్యి ఏండ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది.
"ఈ ఆలయం చాలా పురాతనమైది. క్రీస్తు శకం. 1311లో కాకతీయులు ఆలయాన్ని నిర్మించారు. పూర్వం గొల్లకుంట అనే పల్లెలోని గొల్లలు పశువులు కాస్తూ బతికేవాళ్లు. వాళ్లకు ఒక గుండ్రని రాయి కనిపించింది. అది పశువుల కొట్టంలో అడ్డంగా ఉండటంతో దూరంగా తీసి వదిలేశారు. ఇదే పదేపదే జరిగేది. ఒకరోజు వాళ్ళ పశువు ఓ కామదేవుడు నిత్యం రాయిపై పొదుగుపాలు పోయడం వాళ్లు గమనించారు. అప్పుడే వాళ్లకు శివుడు కలలో దర్శనమిచ్చి రాయి రూపంలో ఉన్నది నేనే నాకు ఆలయాన్ని కట్టండి అని చెప్పారు. దీంతో అక్కడ స్వయంభు శివాలయం కట్టించారు."-విష్ణువర్ధన్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు