Margadarsi New Branches Open in Telangana :ప్రముఖ చిట్‌ఫండ్ సంస్థ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ(Margadarsi) శుక్రవారం జగిత్యాల, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో రెండు నూతన శాఖలను ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 113వ శాఖను సంస్థ ఎండీ శైలజా కిరణ్ ప్రత్యక్షంగా ప్రారంభించారు. అరవై ఏళ్ల ప్రస్థానంలో మార్గదర్శి నిజాయితీగా లక్షలాది ఖాతాదారులకు సేవలందించిందని ఎండీ శైలజా కిరణ్ వివరించారు. అవసరం ఏదైనా మార్గదర్శి ఉందనే ధీమా ఖాతాదారుల్లో ఉందన్నారు.
జగిత్యాలలో 112వ బ్రాంచ్, సూర్యాపేటలో 113వ బ్రాంచ్ ప్రారంభించామని ఇలా ఒకే రోజు రెండు బ్రాంచ్‌లు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సంస్థ ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. 1962లో మార్గదర్శి సంస్థ ప్రారంభించడం మొదలు ఈ 61 ఏళ్లలో 113 బ్రాంచ్‌లను ప్రారంభించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. మార్గదర్శికి ప్రజలకు మధ్య విడదీయలేని బంధం ఉందని, లక్షలాది మంది వినియోగదారులకు మార్గదర్శినే నేస్తమని, ఈ సంస్థపై నమ్మకంతోనే లక్షలాది మంది పెట్టుబడులు పెట్టారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
"ఒకేరోజు రెండు శాఖలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 1962లో మార్గదర్శి సంస్థ ప్రారంభించడం జరిగింది. అప్పటి చిరు సంస్థ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి, ఈ 61 ఏళ్లలో 113 బ్రాంచ్‌లను ప్రారంభించే స్థాయికి ఎదిగింది. మార్గదర్శికి ప్రజలకు మధ్య విడదీయలేని బంధం ఉంది. లక్షలాది మంది వినియోగదారులకు మార్గదర్శి నేస్తం. మార్గదర్శిపై నమ్మకంతో లక్షల కుటుంబాలు పెట్టుబడులు పెట్టారు. వారి ఆర్థిక అభివృద్ధికి సిబ్బంది చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. 4 వేల మందికి పైగా సిబ్బందితో ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాం. చిట్‌ఫండ్ ఇండస్ట్రీలో నిజమైన విలువలు, విశ్వసనీయత వలనే ఈ రంగంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరణ మరువలేనిది."- సీహెచ్. శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ ఎండీ
Margadarsi Chit Fund Private Limited Company :అంతకుముందు ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్‌డిపో ఎదురుగా మార్గదర్శి 112వ శాఖను ఈనాడు సంస్థల ఎండీ సీహెచ్ కిరణ్ వర్చువల్‌గా హాజరుకాగా, సంస్థ ఉపాధ్యక్షుడు పి. రాజాజీ ప్రారంభించారు. అనంతరం వర్చువల్‌గా మాట్లాడిన ఈనాడు ఎండీ కిరణ్ కొత్త కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఖాతాదారుల సేవలో మార్గదర్శి బ్రాంచి జగిత్యాల శాఖ దినదినాభివృద్ధి సాధించాలని ఈనాడు ఎండీ కిరణ్ ఆకాంక్షించారు. మార్గదర్శిపై ఖాతాదారుల నమ్మకమే సంస్థపై 60 ఏళ్లుగా నిబద్ధత, నిజాయితీకి దోహదపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.