Thieves Robbed 36 Lakhs From RTC Bus: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆర్టీసీ బస్సులో రూ. 36 లక్షల భారీ చోరీ కేసును పోలీసులు కేవలం రెండు వారాల్లో ఛేదించారు. హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన ట్రాన్స్‌కో ఉద్యోగి పాలచెర్ల దామోదర్ కర్నూలులో ఉండే సోదరి భాగ్యలక్ష్మికి డబ్బులు అవసరం ఉండటంతో, తన పీఎఫ్, ఇతర ఖాతాల నుంచి నగదు తీసుకున్నారు. ఈనెల 16వ తేదీన 36 లక్షల నగదు సంచిలో పెట్టుకుని కర్నూలు బయలుదేరారు. ఎంజీబీఎస్‌లో ఉదయం ఏడు గంటల 45 నిమిషాలకు బయలుదేరి, 9 గంటల 20 నిమిషాలకు జడ్చర్ల బస్టాండుకు చేరుకున్నారు. అక్కడ బ్యాగును పరిశీలిస్తే డబ్బు కనిపించలేదు. నగదు స్థానంలో నీళ్ల బాటిళ్లున్నాయి.
Jadcherla Bus Theft Case Update :దామోదర్ వెంటనే బాధితుడు జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. భారీ చోరీ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. దొంగతనం జరిగిన రోజు బస్సులో సీసీ కెమెరాలను పరిశీలించగా, అవి పని చేయకపోవడంతో దృశ్యాలు నమోదు కాలేదు. జడ్చర్ల బస్టాండులోని సీసీ కెమెరాలను పరిశీలించినా నిందితుల జాడ తెలియలేదు. జడ్చర్లలోని జాతీయ రహదారి పైవంతెన వద్ద కూడలిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.