Mahabubnagar MLAs Meet Minister Uttam on Pending Projects :ఉమ్మడి రాష్ట్రంలోనే సుమారు 70శాతం పనులు పూర్తైన ప్రాజెక్టులను కూడా, గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం పక్కన పెట్టి పాలమూరు రైతులకు తీరని అన్యాయం చేసిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సచివాలయంలో నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో(Minister Uttam) సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
Mahabubnagar Irrigation Projects : నారాయణపేట్ - కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై మంత్రితో చర్చించారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుందన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరో 2 టీఎంసీలు పెంచాలని కోరారు.
నారాయణపూర్ - కొడంగల్ ఎత్తిపోతలు, పాలమూరు - రంగారెడ్డి, కోయిల సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకోవాలని పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు మంత్రిని కోరారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ సానూకూలంగా స్పందించారని, జిల్లా ప్రాజెక్టులను వేగంగా చేపట్టేందుకు అంగీకరించారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు యెమ్నం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, జి.మధుసూదన్ రెడ్డి, పర్ణికా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వంశీచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.