LRS Applications Telangana 2024 : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తుదారులకు లే-అవుట్‌ల క్రమబద్ధీకరణచేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించింది.
ఆదాయ సమీకరణ, వనరులపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Review Today) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వివాదాలు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు మినహా ఇతర లేఔట్ల ప్లాట్లకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో గత మూడున్నరేళ్లుగా ఎంతో మంది ఎదురుచూపులకు తెరపడింది.
Telangana Govt On LRS Applications :నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్ల (Layout Regularization)లోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత కేసీఆర్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రవేశపెట్టింది. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1000గా.. లే అవుట్ అప్లికేషన్ ఫీజును రూ.10,000గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పథకం కింద మొత్తం 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి.
How To Check TS LRS Application Status 2023: తెలంగాణ LRS అప్లికేషన్ స్టేటస్.. ఇలా తెలుసుకోండి!